Yami Gautam
ఎంటర్‌టైన్మెంట్

Yami Gautam: నా పర్సనల్ విషయాలు బయటికి చెప్పను: యామీ గౌతమ్‌

Yami Gautam: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ప్రజల లైఫ్‌లో ఓ భాగం అయిపోయింది. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తమ డైలీ లైఫ్ విశేషాలు పంచుకుంటూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం వీరికి భిన్నంగా ఉంది. పర్సనల్ విషయాలు బయటి వ్యక్తులతో పంచుకోవద్దని చెబుతుంది. ఆమె ఎవరో కాదు.. యామీ గౌతమ్‌.

‘నువ్విలా’ అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు యామీ గౌతమ్‌ పరిచయమైంది. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి మూవీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే చిత్రమే ఆమెది తెలుగులో చివరి చిత్రం. ఇక ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు ఏమి రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు తీస్తూ అలరిస్తోంది. మొదటగా టీవీ యాడ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన యామీ గౌతమ్‌.. ఆ తర్వాత కన్నడంలో ‘ఉల్లాస ఉత్సాహ’ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడం, పంజాబీ, మలయాళం మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది.

Also Read: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: నయనతార

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘నాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్థితులు బాలేవు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఏం జరుగుతుందనే విషయం తెలుసు. నా డైలీ ఆక్టివిటీస్ సోషల్‌మీడియాలో షేర్ చేసుకోవడం అంతగా నాకు ఇష్టం ఉండదు. బ్రేక్ పాస్ట్ చేశాను. జిమ్‌కి వెళ్ళాను. షాపింగ్‌కి వెళ్ళాను. షూట్‌లో ఉన్నాను. ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో ఎప్పడు పంచుకోలేదు. ఇక మీదట కూడా షేర్ చేసుకోను. నా పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోను. ఇలా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఇష్టం ఉండదు. ఇలా విషయాలు షేర్ చేసుకోవడం అనవసరం కూడా అనేది నా అభిప్రాయం. నా గురించి అభిమానులు ఆలోచించాలని కోరుకోను. వాళ్లకు నా గురించి ఎంత తక్కువ తెలిస్తే.. నేను చేసే రోల్స్‌తో ఆడియన్స్‌కి అంత కనెక్ట్ అవుతా.’ అని చెప్పుకొచ్చింది. ఇక తన కుమారుడిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతానని, అది తన పర్సనల్ డెసిషన్ అని చెప్పుకొచ్చింది. అతడిని ఒక సెలబ్రిటీ కొడుకులా కాకుండా సాధారణ వ్యక్తి కుమారుడిగా పెంచుతానని వెల్లడించింది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు