Nayanthara
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: నయనతార

Nayanthara: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్‌ని పేర్లకు ముందు తన అభిమానులు బిరుదులు ఇస్తూ ఉంటారు. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, ఐకాన్ స్టార్, నేచురల్ స్టార్, లేడి సూపర్ స్టార్ అని పేర్లతో సంభోదిస్తూ ఉంటారు. అయితే ఇలా పేర్లు పెట్టి పిలవడంతో ఆ నటీనటులు తెగ సంబరబడి పోతుంటారు. అయితే కొంతమంది తమిళ హీరోలు ఆ బిరుదులతో పిలవద్దని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అజిత్ కుమార్‌ని తల, ఏకే అని పేర్లతో పిలుస్తూ ఉంటారు. తమిళ ఫ్యాన్స్ ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. అయితే తనను దేవుడు అని పిలవద్దు అని అభిమానులకు గట్టిగా చెప్పాడు. ఇక కమల్ హాసన్‌కు కూడా లోకనాయకుడు అనే బిరుదుతో అభిమానులు సంబోధిస్తూ ఉంటారు. కమల్ హాసన్ కూడా తనను అలా పిలవద్దు అని ప్రకటించాడు. ఇదే బాటలో ఇప్పుడు నయనతార కూడా వచ్చింది. తనను లేడి సూపర్ స్టార్ అని పిలవద్దని ప్రకటించింది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌత్ ఇండియాలో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్‌లలో నయనతార ఒకరు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శీను, తులసి, అదుర్స్, బాబు బంగారం వంటి సూపర్ హిట్ మూవీస్‌లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. సౌత్ ఇండియాలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న నయనతార.. లేడి సూపర్ స్టార్‌గా పేరొందారు. ఆమె అభిమానులు అందరూ లేడి సూపర్ స్టార్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఈ భామకు 40 ఏళ్లు దాటినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. వరుసగా ఆఫర్లు అందుకుంటుంది. అప్పటికీ.. ఇప్పటికీ ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు.

Also Read: ఆస్కార్ 2025కు వెళ్లిన తెలుగు హీరోయిన్ 

అప్పట్లో స్టార్ హీరోలందరితో నటించడంతో పాటు లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక అప్పటి నుంచి ఆమె పేరుకు ముందు లేడి సూపర్‌స్టార్ అని ఫ్యాన్స్ పిలవడం మొదలుపెట్టారు. సౌత్ ఇండియాలో ఈ పేరు విజయశాంతికి ఉండేది. ఆమె తర్వాత నయనతారను పిలవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే నయనతార తనను ‘లేడి సూపర్ స్టార్’ అనే బిరుదుతో పిలవద్దని ప్రకటన విడుదల చేసింది. తన పేరు నయనతార.. అది మాత్రం పిలవండి అని కోరింది. తన జీవితం పుస్తకం లాంటిదని, తన విజయంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. ఇంతలా తనను ఆదరిస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్పింది. ఇప్పటికే తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, ఇక ముందు కూడా చూసుకుంటారని అనుకుంటున్నామని తెలిపింది. ఇప్పటివరకు లేడి సూపర్ స్టార్ అని పిలిచారని, ఇప్పటి నుంచి నయనతార అని మాత్రం పిలవండి అని చెప్పింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, బిరుదులు వచ్చాయని, నన్ను నన్నుగా గుర్తించి నయనతార అని పిలిస్తే చాలు అని వెల్లడించింది.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు