Pawan Kalyan: ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్సే లేదు? ఎందుకంటే?
Pawan Kalyan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్సే లేదు? ఎందుకంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్ ఎప్పుడూ సినిమా, రాజకీయాల మధ్య ఊగిసలాటలోనే ఉంది. ‘ఓజీ’ (OG)తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత, ఆయన కమిట్ అయిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ పోర్షన్ వరకు పూర్తయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న నేపథ్యంలో, దీని తర్వాత పవన్ సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనేది టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఒకే ఒక్క కమిట్‌మెంట్

పవన్ కళ్యాణ్ ఇంతకుముందు జరిగిన ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ, తాను ‘ఓజీ’ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తాను తప్ప మరే సినిమాలో నటించబోనని, అదీ తన అభిమానుల కోసమేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే, ఆయన అధికారికంగా కమిటైంది కేవలం ఆ ప్రాజెక్ట్‌ మాత్రమే. కానీ, టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా ఉంటుందని, అలాగే రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డితో ఎప్పుడో కమీటైన సినిమా కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ మించి, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా సినిమా ఉండబోతుందనే టాక్ ఊహించని విధంగా మొదలైంది.

Also Read- Lady-Oriented Movies: టాలీవుడ్‌లో పెరుగుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. అందుకేనా?

అసాధ్యమైన సినీ ప్రయాణం – అడ్డంకిగా రాజకీయం

పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం, ‘ఓజీ’ సీక్వెల్ లేదంటే ప్రీక్వెల్ రావాలంటే, ప్రస్తుత నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్ పూర్తి ఆసక్తి చూపాలి. కానీ, దానయ్య ఆ సీక్వెల్‌పై అంతగా ఆసక్తి కనబరచడం లేదు, పైగా సుజీత్ కూడా నానితో కొత్త సినిమాతో బిజీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఓజీ’ తదుపరి భాగం రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు, రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా కీలక పరిణామం ఏర్పడితే, పవన్ కళ్యాణ్ దృష్టి పూర్తిగా రాజకీయాల వైపు మళ్లుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై ఉన్న నిబద్ధత అందరికీ తెలిసిందే. ఒకవైపు ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా పూర్తి స్థాయి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు వరుసగా సినిమాలు చేయడం అనేది రెండు పడవలపై ప్రయాణం లాంటిది. గతంలో దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.

Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!

సినిమాల కంటే రాజకీయాలకే

సమయం, కమిట్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదా వాటిని పూర్తి చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రాధాన్యత కచ్చితంగా తన ప్రజల పట్ల, పార్టీ పట్ల నిబద్ధతకే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్న సినిమాలు కార్యరూపం దాల్చడం అనేది రాజకీయ పరిస్థితుల తీవ్రతపైనే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఆయన అభిమానులకు కోరిక ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తన సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు