Bigg Boss Telugu 9: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. వరుసగా కింగ్ నాగ్ ఏడో సీజన్ కి హోస్ట్ గా చేస్తున్నారు. ఇది స్టార్ అయ్యే వరకు ఒకలా ఉంటుంది. స్టార్ట్ అయ్యాక ఇంకోలా ఉంటుంది. బిగ్ బాస్ గురించి మనకీ తెలిసిందేగా.. కొంచం తేడా వచ్చినా.. అప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు. వామ్మో మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా బాబు .. ఇదొక షో నా .. ఇక ఆపండి చాలు అంటూ మండి పడతారు. అయితే, ఈ సీజన్ మొత్తం కొత్తగా ఉండబోతుంది. రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ ఆన్ ఫైర్ లా మొదలైంది.
Also Read: Nepal Gen Z protests: సోషల్ మీడియాపై ఆంక్షలు.. అట్టుడుకుతున్న నేపాల్.. పార్లమెంట్ భవనానికి నిప్పు
అయితే, ప్రతీ సీజన్లో ఒక హౌస్ ఉంటే ఈ సారి రెండుహౌస్ లు ఉండబోతున్నాయి. ఒక ఇంట్లో సెలబ్రిటీలు, మరొక ఇంట్లో ఇంటిలో సామాన్యులు ఉండనున్నారు. ఇది షోకి మరింత డ్రామా, వినోదాన్ని తీసుకురానుంది. అయితే, ఈ సారి సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. అగ్నిపరీక్ష అనే ప్రీ-షో ద్వారా కొందర్ని ఎంపిక చేశారు. తనూజ, ఆశా సైనీ, ఆశా సైనీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్, శ్రష్టి వర్మ, కామనర్ మాస్క్ మ్యాన్, భరణి, రీతూ చౌదరి, కామనర్ డిమోన్ పవన్, సంజన గల్రానీ, రామూ రాథోడ్, కామనర్ శ్రీజ దమ్ము, సుమన్ శెట్టి, కామనర్ ప్రియా శెట్టి, మర్యాద మనీశ్.
Also Read: Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!
అయితే, తాజా సమాచారం ప్రకారం, జానీ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడనే అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. అయితే, ఇప్పటికే దీని కోసం జానీ మాస్టర్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ కు వెళ్ళే సెలబ్రిటీలలో లిస్ట్ లో జానీ మాస్టర్ కూడా ఉన్నాడు. అయితే, అతను ముందు ఒప్పుకోకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఈ వార్త తెర పైకి రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అదే ఇంట్లో ఉన్న శ్రేష్టి వర్మ , జానీ మాస్టర్ వస్తే తట్టుకుంటుందా? లేక అప్పటికప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లిపోతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ వార్త పై నెటిజన్స్ రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు జానీ మాస్టర్ బిగ్ బాస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు.
Also Read: Nepal Gen Z protests: సోషల్ మీడియాపై ఆంక్షలు.. అట్టుడుకుతున్న నేపాల్.. పార్లమెంట్ భవనానికి నిప్పు