Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఫిల్మ్ ‘OG’ రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే, ఈ సారి ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే మరింతఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. పవన్ లో ఎన్నడూ చూడని మాస్ యాంగిల్ లో ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్యాన్స్ నుంచి ప్రేక్షకుల వరకు ఒక మాస్ జాతరగా ఉండబోతోందనే చెప్పుకోవాలి. ఇంకా 24 గంటల్లో మన ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 25 న థియేటర్లలోకి రానుంది.
రెండు రోజుల క్రిత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన “OG Concert” భారీ హైప్ ను తెచ్చింది. ఈ సినిమా పై ఇప్పటికే విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత చిత్రం మీద అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ తో మళ్లీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి.
ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ చెప్పే డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ సినీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. “ పవన్ కళ్యాణ్ ఆన్ ఫైర్ ” అన్నట్లు ఉంది. ఈ ప్రాజెక్ట్ డీసెంబర్ 2022లో DVV ఎంటర్టైన్మెంట్స్ ద్వారా “BIG ANNOUNCEMENT” తో మొదలైంది. డైరెక్టర్ సుజిత్ అనగానే అభిమానులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ పవన్ సినిమా పనులు ఆలస్యం చేయలేదు. అటు పాలిటిక్స్ ను , ఇటు సినిమాను బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
Also Read Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?