Ramayana: రామాయణం పేరుతో ఇప్పటి వరకు చాలా సినిమాలు, చాలా రకాలుగా వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ఆదిపురుష్’ వరకు ‘రామాయణం’పై సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయినా సరే, ఇప్పుడు బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘రామాయణ’పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కొత్తగా ఈ రామాయణలో ఏం చెబుతారు? కథ అదేగా? అంతకు మించి ఏముంటుంది? అనే విషయం అందరికీ తెలుసు. కానీ ‘రామాయణ’తో ఎప్పుడు సినిమా అనౌన్స్ అయినా సరే.. అందరిలో ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. ఈసారి బాలీవుడ్ వాళ్లు చేస్తున్న ప్రయత్నంపై బీభత్సంగా హైప్ రావడానికి కారణం మాత్రం రాముడు, సీత, రావణులు పాత్రల్లో నటిస్తున్న నటీనటులే అని ఒప్పుకోకతప్పదు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సౌత్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్న ఈ ‘రామాయణ’లో రావణుడి పాత్ర హైలైట్ కాబోతోంది. ఆ పాత్రను ఎవరో కాదు.. ‘కెజియఫ్’తో సునామీ సృష్టించిన యష్. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా వార్తలలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో రాముడిగా రణబీర్‌ని, సీతగా సాయిపల్లవిని తీసుకోవడానికి గల కారణాన్ని ‘రామాయణ’ టీమ్ తెలిపింది. వారి నుంచి వచ్చిన సమాధానంతో ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులు యమా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ టీమ్ ఏం చెప్పిందంటే.. రణబీర్ కపూర్‌లో ఎప్పుడూ పాజిటివ్‌నెస్ కనిపిస్తుంటుంది. అలాగే నటుడిగా ఆయన పరిణితి చెందిన నటనను కనబరుస్తుంటారు. అందుకే రాముడిగా రణబీర్‌ని సెలక్ట్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.
Also Read- Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?
ఇక సాయి పల్లవి గురించి చెబుతూ.. సీతా మాతగా ఎవరని మేమంతా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ పాత్రలో నటించే వారు చాలా సహజంగా ఉండాలి అని భావించాం. అందుకే సాయి పల్లవిని సెలక్ట్ చేశాం ఆమె వ్యక్తిగతంగా కూడా చాలా సహజంగా ఉంటారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా.. అందం కోసమని ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదు. తన ఫేస్ ఎలా ఉందో, అలాగే నటించాలని ఆమె భావిస్తుంటారు. ఇప్పుడు సీత పాత్ర విషయంలో కూడా సహజ సౌందర్యానికే పెద్ద పీట వేయాలని భావించాం. అందుకే సాయి పల్లవిని ఆ పాత్రకు తీసుకున్నామని తెలిపారు. దాదాపు రూ. 4 వేల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ ‘రామాయణ’ చిత్రం రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 దీపావళికి మొదటి పార్ట్, 2027 దీపావళికి రెండో పార్ట్ విడుదలకానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు