Robinhood Song: ‘వేర్ ఎవర్ యు గో.. ఐ విల్ ఫాలో’ అంటూ అప్పట్లో టీవీలలో ఓ యాడ్ బాగా వైరల్ అయ్యేది. టీవీలలో వచ్చే అలాంటి యాడ్స్ అన్నింటితో ఓ పాట వస్తే ఎలా ఉంటుందని ఆలోచించినట్లు ఉన్నారు నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీమ్.. క్యాడ్బరీ డైరీ మిల్క్, ఫ్రూటీ ఇలా అన్నింటితో కలిపి ఓ పాటను రెడీ చేశారు. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేసి.. ‘వేర్ ఎవర్ యు గో’ పాట చాలా బాగుంది.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు అని సాంగ్ లింక్‌ని పోస్ట్ చేశారు. ఇప్పుడీ పోస్ట్, అలాగే మహేష్ బాబు వదిలిన ఈ పాట వైరల్ అవుతున్నాయి.
Also Read- Manchu Manoj: ఇది ఆస్తి గొడవ కాదు.. ఎమ్మెల్యేకి మంచు మనోజ్ రిక్వెస్ట్
హీరో నితిన్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఫిల్మ్ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి కానీ, చివరి నిమిషంలో మార్చి 28కి వాయిదా వేశారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. వాలెంటైన్స్ డే ని పురస్కరించుకుని శుక్రవారం మేకర్స్ సెకండ్ సింగిల్ ‘వేర్ ఎవర్ యు గో’ని విడుదల చేశారు. ఈ పాటలో నితిన్, శ్రీలీల ఇద్దరూ చాలా కూల్‌గా కనిపించడమే కాకుండా.. చాలా సింపుల్ స్టెప్స్‌తో పాటపై క్రేజ్‌ని పెంచేశారు. పలు బ్రాండ్‌ల క్రియేటివ్ మిక్స్‌తో, ఐకానిక్ ట్యాగ్‌లైన్‌లతో వచ్చిన ఈ పాటలో శ్రీలీల గ్లామర్ వావ్ అనేలా ఉంది.
ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ మెలోడీతో కూడిన ఎక్జయిటింగ్ ట్రాక్‌గా ఈ పాటను స్వరపరచగా.. ఆర్మాణ్ మాలిక్ తన గాత్రంతో వినగానే ఎక్కేసేలా ఆలపించారు. ఈ ప్రేమ పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరికీ ఈ పాట కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. నితిన్‌కు ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల.. మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ సాంగ్‌గా వచ్చిన ఈ మెలోడీ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
#WhereverYouGo song sounds fantastic….Wishing the entire team great success ahead 🤗👍🏻https://t.co/LeGN4skRiz#Robinhood@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash #SaiSriram @EditorKoti @MythriOfficial
— Mahesh Babu (@urstrulyMahesh) February 14, 2025
ఇవి కూడా చదవండి: