Bandla Ganesh: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) పేరు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏ వేదిక ఎక్కినా, ఏ ఫంక్షన్‌కు హాజరైనా ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో తనకున్న అనుబంధాన్ని పొగుడుతూనే, పవన్ ఈవెంట్స్‌కి రానివ్వడం లేదంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ని పరుషంగా విమర్శించడం నుంచి.. తాజాగా చిన్న సినిమా వేడుకల్లో యువ హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతూనే, పరోక్షంగా కొందరు అగ్ర హీరోల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ, మౌళి, కిరణ్ అబ్బవరం వంటి హీరోలను పొగుడుతూ, ‘ఒక్క హిట్ రాగానే స్టార్‌లా ఫీలై, అర్ధరాత్రి కొత్త బూట్లు, క్యాప్‌లు, లూజ్ ప్యాంట్లతో తిరిగే వాళ్లను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను ఉద్దేశించినవేనని నెటిజన్లు, సినీ వర్గాలు భావిస్తున్నారు.
మాటల మర్మం వెనుక కారణాలు ఏమై ఉండవచ్చు?
బండ్ల గణేష్ ప్రసంగాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై సినీ పరిశ్రమలో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనను దగ్గరగా పరిశీలిస్తున్నవారు మాత్రం.. ఈ వ్యాఖ్యల వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉండవచ్చని అంటున్నారు. నిర్మాతగా గత కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమా నిర్మాణం నుంచి దూరంగా ఉన్నారు. మళ్లీ నిర్మాణ రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న ఆయన, తరచుగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని భావించవచ్చు. ఆయన సంచలన ప్రసంగాలు వేదికకు, ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా కూడా మారుతున్నాయి. అలాగే, ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా సరైన పెద్ద సినిమాలు నిర్మించలేకపోవడం, స్టార్ హీరోలు ఆయనకు సినిమాలు ఇవ్వకపోవడాన్ని తట్టుకోలేక, ఆ ఫ్రస్ట్రేషన్‌ను వేదికల మీద పరోక్షంగా బయటపెడుతున్నారనే వాదన కూడా బలంగా ఉంది. కొంతమంది యువ హీరోలను పొగుడుతూ, వారు కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారని చెప్పడం ద్వారా, తాను కూడా కొత్త ప్రాజెక్ట్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఇండస్ట్రీకి పంపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Also Read- Fauzi: ప్రభాస్ ‘ఫౌజి’లో తనయుడు.. కన్ఫర్మ్ చేసిన హీరో సుధీర్ బాబు!
నియంత్రణ కోల్పోవడం, కవరింగ్ చేసుకోవడం
ఆవేశంలో నోరు జారి ఇతరులను టార్గెట్ చేయడం, ఆ తర్వాత నేను ఎవరినీ ఉద్దేశించి అనలేదు అంటూ కవరింగ్ చేసుకోవడం బండ్ల గణేష్‌కి కొత్తేమీ కాదు. ఈ తీరుతో ఆయనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అయితే, తాజాగా తను ప్రస్తుతం ఏ సినిమాను నిర్మించడం లేదని, దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఒక పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేయడం చూస్తుంటే, ఆయన వ్యాఖ్యలు కావాలని చేస్తున్నారో, లేక నిజంగానే నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారో అర్థం కాక సినీ వర్గాలు సతమతమవుతున్నాయి. ఏది ఏమైనా, బండ్ల గణేష్ స్పీచ్‌లు తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక ‘టాక్ షో’గా మారి, హాట్ డిబేట్‌కి దారి తీస్తున్నాయనేది మాత్రం కాదనలేని సత్యం.
ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.మీ బండ్ల గణేష్
— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
