Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరితో ఈయన నటించాడు. తెలుగు ప్రేక్షకులను విలన్ గా భయపెట్టాడు.. కామెడీతో నవ్వించాడు.. ఎమోషన్స్ తో ఏడిపించాడు కూడా..! నటనలో ఈయనకు ఈయనే సాటి. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆయన పోరాడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉందే!
కోట శ్రీనివాసరావుకు ఏమైంది..?
తాజాగా కోట శ్రీనివాసరావు ను నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) కలిసినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆరోగ్యం గురించి అడిగినట్లు తెలుస్తోంది. ఇక కోటాతో కలిసి దిగిన ఫోటోను బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ” కోట శ్రీనివాసరావు గారితో ఈ రోజు.. కోటా బాబాయ్ ను కలవడం చాలా సంతోషంగా అనిపించింది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.
Also Read: Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!
ఇలా మారిపోయాడేంటి అంటూ వందల కామెంట్స్?
ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ వామ్మో ఎలా ఉండే ఆయన ఇలా మారిపోయాడేంటి? అసలు అసలు ఈ ఫొటో నిజమేనా ? అంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. కోటా గారిని అలా వదిలేయకండి? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలికి ఏదో పెద్ద గాయమైనట్లు తెలుస్తుంది. కట్టు కూడా కనిపిస్తోంది. బక్క చిక్కిపోయి అసలు గుర్తుపట్టలేన్నంతగా మారిపోయారు. బాగా తెలిసిన వాళ్ళు ఈ ఫొటో చూస్తే కన్నీరు పెట్టుకుంటారు. 2023 లో వచ్చిన సువర్ణ సుందరి అనే చిత్రంలో చివరిగా కనిపించారు.
నా తుది శ్వాస వరకు సినిమాల్లోనే నటిస్తా..?
నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటా, కానీ ఏ డైరెక్టర్ కూడా తనకి అవకాశాలు ఇవ్వడం లేదని, పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు. అయితే, ఇక ఇప్పుడు మొత్తానికే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని ఫొటో చూస్తేనే అర్ధమవుతోంది. ఆరోగ్యం నుంచి త్వరగా కొలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.