Purushaha: మగాళ్లను మొక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోతాం..
Purushaha (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Purushaha: మగాళ్లను మొక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోతాం.. పోస్టర్ వైరల్!

Purushaha: ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్‌ని గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా చాలు.. మినిమం గ్యారంటీ హిట్ ఇచ్చేస్తున్నారు. కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ కూడా అవసరం లేకుండా సక్సెస్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల కాలంలో విజయం సాధించిన చిన్న చిత్రాలే. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు సైతం కామెడీ బేస్డ్, ఎంటర్టైన్మెంట్ అందించే కథల్ని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చేది రిలాక్స్ అవడానికి, ఎంటర్‌టైన్‌మెంట్ పొందడానికనే విషయం తెలియంది కాదు. అందుకే ఎక్కువగా వినోదభరితమైన కథలకే పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ (Purushaha) మూవీ టీమ్ వస్తోంది. ఆ విషయం తాజాగా వారు విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది.

Also Read- Sandeep Raj: సిల్వర్ స్క్రీన్‌కి నేను నచ్చలేదేమో.. ‘మోగ్లీ’ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్.. మెగా హీరో సపోర్ట్!

మొక్కు కుంటూ కాదు తొక్కుకుంటూ..

ఇప్పటి వరకు ‘పురుష:’ టీం నుంచి వదిలిన పోస్టర్స్, క్యాప్షన్స్, పెళ్లి, ఆడ, మగ, స్వేచ్ఛ అంటూ వదిలిన పాయింట్స్ అన్నీ గమనిస్తే.. ఈ సినిమా ఆద్యంతం నవ్వించే కథతో సిద్దం అవుతున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా వదిలిన పోస్టర్ సినిమాపై మరింతగా ఇంట్రస్ట్ పెంచేస్తోంది. ‘మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కుకుంటూ పోతాం’ అంటూ పోస్టర్‌పై రాసిన పంచ్ లైన్.. సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ విడుదల వరకు ఇలాంటి పోస్టర్స్‌ను మరిన్ని వదిలి సినిమాపై భారీగా అంచనాలను పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan) బత్తులను హీరోగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు (Battula Koteswara Rao) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో మంచి బజ్ అయితే క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

Also Read- Jr NTR: చిరు బాటలో జూనియర్ ఎన్టీఆర్.. అనుమతి లేకుండా పేరు, ఫొటో వాడకూడదంటూ..!

త్వరలోనే రిలీజ్ డేట్..

పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని చిత్ర టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరూ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నామని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క