Vidhrohi Song Launch
ఎంటర్‌టైన్మెంట్

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

VV Vinayak: మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ (VV Vinayak) పబ్లిక్‌లో కనిపించి చాలా కాలమే అవుతుంది. ఆ మధ్య ఆయన హీరోగా సినిమా చేయబోతున్నాడంటూ ఓ వార్త వైరల్ అయింది. సినిమా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఆయన హీరోగా కనిపించేందుకు చేసిన డైట్ ప్లాన్ వికటించడంతో.. అనారోగ్య బారిన పడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అందుకేనేమో ఆయన పబ్లిక్‌లో ఎక్కడా కనిపించలేదు? ఆయన నుంచి తర్వాత ఏ సినిమా ప్రకటన రాలేదు. చాలా రోజుల తర్వాత వివి వినాయక్ మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ‘విద్రోహి’ అనే సినిమా ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించారు. త్వరలోనే ఆయన నుంచి మంచి యాక్షన్ ఫిల్మ్ రావాలని అంతా కోరుకుంటున్నారు. అలాగే ‘అదుర్స్ 2’ కూడా కావాలని ఇలా వినాయక్‌ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

‎‘విద్రోహి’ (Vidhrohi) విషయానికి వస్తే..

రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విద్రోహి’. వి ఎస్‌ వి (VSV) దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్ (Hero Srikanth) విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు వివి వినాయక్ చేత ఈ మూవీని ఫస్ట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయించారు. సాంగ్ విడుదల అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ..‎ ఈ సినిమా ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడా నాకు తెలుసు. చాలా మంచి కథ. నేను విడుదల చేసిన ఈ సాంగ్ చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇందులో పోలీస్ పాత్ర చేసిన రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

Also Read- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌

చిత్ర దర్శకుడు వి ఎస్‌ వి మాట్లాడుతూ.. మా సినిమాలోని మొదటి సాంగ్‌ని విడుదల చేసిన దర్శకులు వినాయక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి పాత్ర ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ‘ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉందని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు ఐబీఎమ్ మెగా మ్యూజిక్ అధినేత పప్పుల కనక దుర్గారావు.‎

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!