Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఇప్పటికే నేషనల్ లెవల్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఇప్పుడీ సినిమా సరిహద్దులు దాటి గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు
చిత్ర నిర్మాత విక్రమ్ రెడ్డి ‘విశ్వంభర’ను అంతర్జాతీయ వేదిక అయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. ఈ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాల గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, VFX స్టూడియోల సహకారం గురించి కూడా తెలియజేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ‘విశ్వంభర’కు సంబంధించి చర్చ నడుస్తుంది. ‘విశ్వంభర’ ఎక్స్‌క్లూజివ్ బుక్‌లో ఏముంది? అని అందరి మనసుల్లో ప్రశ్నలు తలెత్తేలా చేయడంలో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నిజంగానే అసలు ఈ బుక్‌లో ఏముందనేది? ఇప్పటి వరకు అయితే ఎవరికీ తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో కూడా మేకర్స్ ఏం క్లారిటీ ఇవ్వలేదు. బహుశా, చిత్ర విడుదల తేదీ అనౌన్స్‌మెంట్‌లో ఏమైనా చెబుతారేమో చూడాలి.
Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..
టాప్ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు 90 శాతం పూర్తయినట్లుగా తెలుస్తుంది. మిగతా పనులు శర వేగంగా సాగుతున్నాయి. బ్యాలెన్స్ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని భారీ ప్రమోషన్‌లతో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కునాల్ కపూర్ మరో ముఖ్యమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను ఛోటా కె.నాయుడు మ్యాసీవ్‌గా ప్రజెంట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. వాస్తవానికి ఈ సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా వేసి, ఈ సినిమాకు అనుకున్న విడుదల తేదీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు అడ్జస్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు