Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్
Vishnu Vinyasam (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Vishnu Vinyasam: యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు (King Of Entertainment Sree Vishnu).. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు (Yadunaath Maruthi Rao) దర్శకత్వంలో ఓ యూనిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. హేమ, షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ.. ఒక యానిమేషన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివిల్ చేసిన తీరు అదిరిందనే చెప్పాలి. ఈ వీడియోను గమనిస్తే..

Also Read- Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

No Brakes – Just Laughs

ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌ సైకిల్‌పై నగర వీధుల్లో శ్రీ విష్ణు దూసుకెళుతున్నారు. ఆయన కనిపించిన మొదటి ఫ్రేమ్ నుంచే అలరించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది శ్రీ విష్ణు ఎసెంట్రిక్ స్క్రీన్ పర్సోనాకు అద్దం పట్టేలా, ఇప్పటి వరకు ఆయన చేయని ఓ కొత్త పాత్రను పరిచయం చేస్తోంది. ఆయన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌ను హైలైట్ చేస్తూ, ‘No Brakes – Just Laughs’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను యాడ్ చేశారు. ‘చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి’.. అంటూ వినిపించే ప్లేఫుల్ వాయిస్‌ ఓవర్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. రధన్ అందించిన స్కోర్ కూడా ఈ మొత్తం టైటిల్ వీడియోకి మరింత హ్యూమర్‌ను ఎలివేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..

టాకీ పార్ట్ పూర్తి

ఈ వీడియో చూసిన వారంతా.. మరో వైవిధ్య భరితమైన కంటెంట్‌తో శ్రీ విష్ణు రాబోతున్నాడని అంటూ, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక (Nayana Sarika) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉందని, చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో థియేట్రికల్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా ఈ టైటిల్ గ్లింప్స్ ద్వారా తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు