Vishnu Manchu: టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుల్లో మంచు విష్ణు (Manchu Vishnu) ఒకరు. ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో విష్ణు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ద్వారానే తన కుమారుడు అవ్రామ్ ను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు విష్ణు. ఇందులో తిన్నడు (మంచు విష్ణు) చిన్నప్పటి పాత్రను అవ్రామ్ పోషిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా తన కుమారుడి ఎంట్రీ గురించి విష్ణు స్పందించారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
మంచు విష్ణు ఏమన్నారంటే?
తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa)తోనే కుమారుడు ఎంట్రీ ఇస్తుండటంపై హీరో మంచు విష్ణు నెట్టింట ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అవ్రామ్ సెట్ లోకి అడుగుపెట్టడం, కెమెరా ముందు నిలబడటం, డైలాగ్స్ చెప్పడం ఇలా ప్రతీది తన లైఫ్ లో భావోద్వేగభరిత క్షణాలని విష్ణు అన్నారు. ఒకప్పుడు తను కలలు కన్న అదే ప్రపంచంలోకి తన కుమారుడు అడుగుపెట్టడం చూస్తుంటే తండ్రిగా ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంతోషానికి సాటి మరోటి రాదని పేర్కొన్నారు. ఇది కేవలం అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదని.. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకమని విష్ణు చెప్పుకొచ్చారు. తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలే తన కుమారుడిపై చూపిస్తారని భావిస్తున్నట్లు ఎక్స్ లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
My little Avram, makes his debut in Kannappa.
Watching him walk onto the set, say his lines, and live this dream, has been one of the most emotional moments of my life.
As a father, nothing compares to seeing your child shine under the same sky you once dreamed beneath.
This… pic.twitter.com/b6HfJDQXDB
— Vishnu Manchu (@iVishnuManchu) June 18, 2025
నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!
గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కన్నప్ప అప్ డేట్స్, విష్ణు ఇంటర్వ్యూలు ఇలా ఏది బయటకు వచ్చినా విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కుమారుడి గురించి పెట్టిన పోస్ట్ ను మాత్రం నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ఒక తండ్రిగా విష్ణు భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలమని పలువురు కామెంట్లు పెడుతున్నారు . అవ్రామ్ సినీ కెరీర్ సైతం గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కన్నప్పలో అవ్రామ్ మంచి నటన కనబరిచి.. తాత (Mohan Babu)కు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: Air India Flights Cut: విమానాల్లో వరుస సమస్యలు.. ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. సారీ అంటూ!
కన్నప్ప రిలీజ్ ఎప్పుడంటే?
‘కన్నప్ప’ (kannappa) విషయానికొస్తే ఈ సినిమా ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) హీరోయిన్ గా చేసింది. మోహన్‌బాబు (Mohan babu), మోహన్‌లాల్, ప్రభాస్ (Prabhas), అక్షయ్‌కుమార్, కాజల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.