Kannappa: మంచు విష్ణు (Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 27న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ట్రైలర్ (Trailer)ను విడుదల చేశారు. 2.54 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో స్టార్ నటీనటులు అందరినీ పరిచయం చేస్తూ చూపించారు. ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mhohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) కామియో పాత్రలతో కూడిన ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో దీన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌లోని ఐదు విషయాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
విష్ణు యాక్షన్ సన్నివేశాలు
కన్నప్ప క్యారెక్టర్ అడవుల్లో ఉండే సాధారణ గిరిజన వ్యక్తి. ఆ కాలంలో తెగల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. వాటికి నేటి మేథను జోడించి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు అర్థమవుతున్నది. యాక్షన్ సీన్స్‌లో విష్ణు తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గిరిజన యువకుడిగా, శివుడి భక్తుడిగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సోషియో ఫాంటసీ అంశాలతో ముడిపడి ఉన్న ఈ చిత్రంపై విష్ణు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో తన తండ్రితో కలిసి నిర్మించాడు.
ప్రభాస్ కామియో
ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇందులో ప్రభాస్ రుద్ర పాత్ర పోషించాడు. నాస్తికుడైన కన్నప్ప(తిన్నడు)ను శివుడి భక్తుడిగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సందర్భంలో ప్రభాస్, విష్ణుకు మధ్య ఫైట్ సీన్‌ను కూడా ట్రైలర్ చూపించి ఆసక్తిని పెంచారు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు.
గిరిజన యోధుడిగా మోహన్ లాల్
ట్రైలర్ చివరిలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కనిపించారు. గిరిజన యోధుడి పాత్ర పోషించాడు. ఆయన డైలాగ్ డెలివరీ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మహోగ్రమైన లుక్‌లో కనిపించి మెప్పించాడు. మొదటినుంచి మోహన్ లాల్ పాత్ర విషయాలను చిత్రబృందం సస్పెన్స్‌గా ఉంచుతున్నది. ట్రైలర్‌ను బట్టి చూస్తే, కన్నప్పకు గురువుగా చేశాడేమో అని ప్రచారం జరుగుతున్నది.
Read Also- Venu Swamy : మరో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. భారీ ప్రమాదాలు జరుగుతాయంటూ..?
ప్రీతి ముకుందన్‌తో రొమాన్స్
కన్నప్ప మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించింది. ట్రైలర్‌లో ఈమె కూడా తళుక్కున మెరిసింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అందరూ భావిస్తున్నారు. గతంలో ‘సగమై.. చెరిసమై’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయగా, అది వివాదాస్పదమైంది. శ్రీమణి సాహిత్యంలో రేవంత్, సాహితి ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. విష్ణు, ప్రీతి ముకుందన్ మధ్య చెమిస్ట్రీ బాగా కుదిరింది. శివుడి భక్తుడికి రొమాంటిక్ సాంగ్ ఏంటనే విమర్శలు వచ్చినా విష్ణు మాత్రం వాటిని తిప్పికొట్టాడు. గతంలో తీసిన భక్త కన్నప్ప సినిమాలో బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పాడు.
శివునిగా అక్షయ్ కుమార్
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కన్నప్ప చిత్రంలో శివుడి పాత్ర పోషించాడు. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను బట్టి, సినిమా అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది. ఎంతో ప్రశాంతంగా జరుగుతున్నది చూస్తున్నట్టు కనిపించింది. మొత్తంగా నాస్తికుడైన వ్యక్తి శివుడి భక్తుడుగా ఎలా మారాడన్నదే కథ. మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని దర్శకుడు. మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్, కౌశల్, రాహుల్ మాధవ్, దేవరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.