Virat Kohli Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో ఆ హీరో? ఫిక్సా?
Virat Kohli
ఎంటర్‌టైన్‌మెంట్

Virat Kohli Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో ఆ హీరో? ఫిక్సా?

Virat Kohli Biopic: ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో పలానా హీరో చేస్తున్నాడంటూ ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా వినిపించింది. కానీ, రామ్ చరణ్ క్రికెట్ నేపథ్యంలో సినిమా అయితే చేస్తున్నాడు కానీ, అది విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే కాదు. అలాగే బాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోల పేర్లు కూడా ఈ బయోపిక్ కోసం వినిపించాయి. ఇప్పుడు కొత్తగా కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో పేరు తెరమీదకు వచ్చింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సిలంబరసన్ టీఆర్ (Silambarasan TR). అర్థం కాలేదా? సిలంబరసన్ టీఆర్ అంటే శింబు. ఈ పేరు తెరమీదకి రావడానికి కారణం లేకపోలేదు. అందుకు కారణం కోహ్లీనే.

Also Read- Affair Video Song: మగవాళ్లకి ఎంట్రీలేని కంట్రీలోకే వస్తానంటే.. ‘ఎఫైర్’ వీడియో సాంగ్ వైరల్

అవును, కోహ్లీ ఈ మధ్య ఓ చాట్ షో మాట్లాడుతూ.. శింబు నటించిన ‘పత్తు తల’ సినిమాలోని ‘నీ సింహం దాన్’ అనే పాటను చాలా చాలా ఇష్టపడతానని చెప్పారు. ఆయన ఇష్టపడుతున్నాడని కాదు కానీ, నిజంగా ఈ పాట సోషల్ మీడియా రీల్స్‌లోనూ, క్రికెట్ వీడియోలలోనూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. శింబు పాట గురించి కోహ్లీ చెబుతున్న వీడియోను ఆర్‌సీబీ పోస్ట్ చేసి, విరాట్‌తో పాటు శింబు పేరును కూడా ట్యాగ్ చేసింది. వెంటనే శింబు రియాక్ట్ అవుతూ.. ‘నీ సింహం దాన్’ అంటే ‘నువ్వు నిజమైన సింహం’ అని అన్నారు. దీంతో కోహ్లీ, శింబుల కామన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో వీరి సంభాషణను వైరల్ చేస్తున్నారు. వారి కలయికలోని ఈ సంభాషణకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది సంతోషంతోనే ఆగిపోలేదు. ఇద్దరి బియర్డ్ స్టైల్ లుక్ సేమ్ టు సేమ్ ఉంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ మధ్య శింబుని చూస్తే, వెంటనే కోహ్లీనే గుర్తొస్తాడు. వారి మధ్య జరిగిన ఈ సంభాషణ తర్వాత కోహ్లీ బయోపిక్ గురించి బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించబోతున్నాడా? అనేలా ముంబై వర్గాల్లో జరుగుతున్న చర్చలతో ఆ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్, ఈ బయోపిక్ గురించి జరుగుతున్న చర్చలు, సంభాషణలన్నీ చూసిన తర్వాత, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఓకే అంటే మాత్రం శింబు ఈ బయోపిక్‌లో నటించే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనేలా టాక్ నడుస్తుంది.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ పెన్‌డ్రైవ్‌లు వస్తున్నాయ్.. అందులో ఏముందంటే?

ఫైనల్‌గా ఈ బయోపిక్‌లో నటించేది ఎవరో తెలియదు కానీ, శింబు అయితే పర్ఫెక్ట్ అనేలా అయితే ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ఆయన దూకుడు చూస్తుంటే ఈసారి కచ్చితంగా కప్పు ఆర్సీబీదే అని అనిపిస్తుంది. మరోవైపు శింబు వరస ప్రాజెక్ట్‌లతో క్షణం తీరికలేని విధంగా షెడ్యూల్ రెడీ చేసుకున్నాడు. ‘థగ్ లైఫ్’తో పాటు మరో మూడు సినిమాలను ఆయన ఓకే చేసి ఉన్నారు. ఒకవేళ నిజంగా కోహ్లీ బయోపిక్ శింబు చేయాల్సి వస్తే మాత్రం.. దానికి చాలా సమయం పట్టే అవకాశముంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..

Simbu
Simbu

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..