Affair Video Song
ఎంటర్‌టైన్మెంట్

Affair Video Song: మగవాళ్లకి ఎంట్రీలేని కంట్రీలోకే వస్తానంటే.. ‘ఎఫైర్’ వీడియో సాంగ్ వైరల్

Affair Video Song: ప్రేమకు, ఎఫైర్‌కు చాలా తేడా ఉంది. ప్రేమించడం మనసుకి సంబంధించినది అయితే ఎఫైర్ శరీరానికి మాత్రమే చెందినది. ఈ రెండింటికి తేడా తెలియకుండా ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఒకరిని ప్రేమించి, ఇంకొకరితో ఎఫైర్ నడిపే వారెందరో ఉన్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేదు. ప్రస్తుత ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ భూతద్దం వేసి వెతికినా దొరకదు. అలా దొరికితే, దానిని జీవితాంతం కాపాడుకోగలిగితే చాలు, ఆ జీవితం, జన్మ ధన్యమైనట్లే. ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని ఎంతో ప్రేమించి, ఆరాధించి అతనికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని, అతనున్న చోటికి వెళితే, అప్పటికే ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని అక్కడ ఫ్లట్ చేస్తుంటే, అది ప్రేమించిన అమ్మాయి కంట పడితే.. ఆ యువతి ఎలా రియాక్ట్ అయింది? అనేదే ఈ ‘ఎఫైర్’ ఆల్బమ్. ఈ ఆల్బమ్ నుంచి తాజాగా ఓ వీడియో సాంగ్ విడుదలైంది.

Also Read- Janulyri Emotional: వెక్కి వెక్కి ఏడుస్తూ సంచలన వీడియో షేర్ చేసిన డ్యాన్సర్ జాను లిరీ

క్లౌట్ స్టూడియోస్, 4 సీజన్స్ క్రియేషన్స్, బిగ్ టీవీ మ్యూజిక్ (BigTV Music) సంయుక్తంగా నిర్మించిన ఈ ‘ఎఫైర్’ ఆల్బమ్ సాంగ్‌కు శరవణ వాసుదేవ్ స్వరాలు సమకూర్చగా, శ్రీరాగ్ వడ్లకొండ సాహిత్యం అందించారు. లక్ష్మీ స్వీయ వోకల్స్‌లో ఈ పాట మెస్మరైజింగ్‌గా ఉంది. బాబీ ఈ పాటకు డైరెక్షన్‌తో పాటు కొరియోగ్రఫీ చేశారు. హైదరాబాద్ లొకేషన్స్‌లో ఈ పాటను అమర్‌దీప్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే బిందు నూతక్కి, దీపు గౌడ్, శైలు ఈ పాటలో కనిపించారు. బిందు నూతక్కి (Bindhu Nuthakki) అభినయం ఈ పాటకు హైలెట్‌ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట చార్ట్ బస్టర్ లిస్ట్‌లోకి చేరడమే కాకుండా టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ పాటను ప్రముఖులెందరో ప్రశంసిస్తుండటం విశేషం. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర దర్శకులు హరీష్ శంకర్, కరుణ కుమార్ ఈ పాట చిత్రీకరణ విధానంపై ఎంతగానో ప్రశంసలు కురిపించారు. అలాగే పాటలో ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయని, స్వచ్ఛమైన సినిమాను తలపిస్తుందని ఈ పాటపై వారు రియాక్ట్ అయ్యారు. ‘లవ్ రెడ్డి’ ఫేమ్ అంజన్, శ్రావణి మాట్లాడుతూ.. ఇందులో బిందు నూతక్కి నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూడగానే ఆకర్షిస్తున్నాయని తెలిపారు. దినేష్ తేజ్, అర్జున్ కళ్యాణ్ స్పందిస్తూ.. శరవణ వాసుదేవన్ సంగీతం, బాబీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇలా.. ఎందరో గొప్ప వ్యక్తుల నుంచి ఈ పాటకు ప్రశంసలు దక్కుతున్నాయి.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ పెన్‌డ్రైవ్‌లు వస్తున్నాయ్.. అందులో ఏముందంటే?

ఈ పాట లిరిక్స్ గమనిస్తే.. ఎన్నో ఆశలతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రేమికుడి కోసం వెళ్లిన ప్రియురాలికి, అక్కడ ప్రియుడు వేరొకరితో ఉండటం గమనించి, అతనని ఎంతగా ద్వేషిస్తుందో? ఆ వంచనకు అతనితో పాటు మగవాళ్లందరినీ ఏం చేయాలని ఆమె కోరుకుంటుందో ఈ పాటలోని లిరిక్స్ తెలుపుతున్నాయి.
‘ఒక మాటే చెబుతా మీకు.. నాతో పాటే వింటానంటే
మగవాళ్లకి ఎంట్రీలేని కంట్రీలోకే వస్తానంటే..
మీకెవ్వరు ఇప్పటిదాకా చెప్పని సూక్తులు చెప్పా
భూలోకం సరిపోదమ్మా.. భూమ్మీదే అవి పరిచావంటే..
లేటయితే సారీ అంటూ, నైట్ అయితే మిస్ యూ అంటూ, రోజంతా లవ్ అంటూ..
భూమిపై బాయ్స్ అంటూ లేకే లవ్లీ గాళ్సే ఉంటే నిండుగా..
ఏ ప్రాబ్లమ్ అంటూ మాకే ఇంక రానే రాదుగా..’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట వినగానే ఎక్కేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు