Vilaya Thandavam: వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కార్తీక్ రాజు (Karthik Raju), తాజాగా సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయ తాండవం’ (Vilaya Thandavam). వీఎస్ వాసు (VS Vasu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. విడుదలైన పోస్టర్ సినిమాలోని ఇంటెన్సిటీని కళ్లకు కట్టింది. చుట్టూ అగ్ని జ్వాలలు, మంటల్లో కాలిపోతున్న వస్తువుల మధ్య హీరో కార్తీక్ రాజు చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. తలకు కట్టు, చేతిపై అగ్ని కణాలు, కింద పడిపోయిన ఫోటో ఫ్రేమ్.. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు.
Also Read- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు
పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మందల ధర్మారావు, గుంపు భాస్కర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీక్ రాజు సరసన పార్వతి అరుణ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘పుష్ప’ ఫేమ్ జగదీష్ (కేశవ) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా, తాజా క్రిస్మస్ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌తో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.
త్వరలోనే మరిన్ని డిటైల్స్
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘విలయ తాండవం’ ఒక మంచి విందుగా ఉండబోతుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము. దర్శకుడు వాసు అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి యాక్షన్ ఫీస్ట్‌లా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

