Kingdom OTT: విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘కింగ్డమ్’ (Kingdom OTT) జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చే తేదీని ప్రకటించారు నిర్మాతలు. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా 27, ఆగస్టు 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలను మంచి వసూళ్లు రాబట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
Read also-Viral Video: రీల్స్ కోసం వెర్రి వేషాలు.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!
‘కింగ్డమ్’ సినిమా విడుదల సమయంలో విజయ్ చేశిన వ్యాఖ్యలు అప్పుడు పెద్ద దుమారాన్నే లేపాయ. ఒక్క హిట్ ఇస్తే టాప్ లో పోయి కూర్చుటా అన్న విజయ్ మాటలు తర్వాత అంత ప్రభావం చూపించలేక పోయాయి. సినిమా కూడా ఆసించిన స్థాయిలో అడక పోవడంతో అంతా సైలెంట్ అయిపోయారు. సినిమా ఓవరాల్ గా ఓకే అనిపించుకున్న కలెక్షన్ మాత్రం నిర్మాత అనుకున్న మార్క్ అందుకోలేక పోయింది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలా మంది విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు థియేటర్ లో మిస్ అయిన వారికి ఓటీటీలో మంచి అనుభూతిని ఇస్తుందని నిర్మాత చెబుతున్నారు. ఇప్పటికే థియేటర్ లోఫెయిల్ అయి ఓటీటీలో మంచి టాక్ తో ముందుకుపోతున్న హరిహర వీరమల్లు లా ఈ సినిమా కూడా ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంటుందని మూవీ టీం ఆశిస్తుంది.
Read also-The Paradise Film: సినిమా ప్రమోషన్స్ ఇలా కూడా చేస్తారా.. ఇదెక్కడా చూడలా..
In the kingdom of gold, blood and fire… a new king rises from the ashes 👑🔥
Watch #Kingdom on Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam and as #Saamrajya in Hindi from 27th August! ❤️🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP… pic.twitter.com/l0e4zBry3S
— Sithara Entertainments (@SitharaEnts) August 25, 2025
