Kota Srinivasa Rao ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kota Srinivasa Rao: తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కోట శ్రీనివాసరావు కన్నుమూత

Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో వందలాది చిత్రాల్లో మెరిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమై, సినిమాలకు దూరమైన ఆయన 750కి పైగా చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన కోట మరణం సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది

కోట శ్రీనివాసరావుతో బండ్ల గణేష్

జూన్ నెలలో తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కలిసిన సందర్భంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో, కొంతకాలంగా ఎవరికి కనిపించని కోట శ్రీనివాసరావు బాగా బక్కచిక్కి, గుర్తుపట్టలేనంతగా మారిపోయినట్లు కనిపించారు. ఆయన కాళ్లు నల్లగా మారడంతో పాటు, ఒక కాలి వేళ్లు తొలగించినట్లు కనిపించడం అభిమానులను కలవరపరిచింది. ఈ ఫోటోలు చూసిన సినీ ప్రియులు కోట ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఆయన తీవ్ర అనారోగ్యంతో జీవన్మరణ సమస్యలో ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి.

Also Read:  Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?

అయినప్పటికీ, ఈ సంఘటన జరిగిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు కన్నుమూయడం సినీ పరిశ్రమను, అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెడుతున్నారు.

Also Read:  Radhika Yadav Murder Case: తండ్రి చేతిలో టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు