Producer: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాత మృతి చెందారు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిర్మాత ‘తేనెటీగ’ రామారావు కన్నుమూశారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘తేనెటీగ’ రామారావు ఇప్పటి జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చేమో కానీ, ఒకప్పుడు మాత్రం ఆయన మంచి మంచి చిత్రాలను నిర్మించారు. ఆయన పూర్తి పేరు జవ్వాజి వెంకట రామారావు అలియాస్ తేనెటీగ రామారావు (68), ఆదివారం (మే 4) మధ్యాహ్నం హైదరాబాద్‌లో లివర్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Also Read- Babil Khan: ఏడుస్తూ.. బాలీవుడ్‌పై ఇర్పాన్ ఖాన్ తనయుడు షాకింగ్ కామెంట్స్
‘తేనెటీగ’ రామారావు విషయానికి వస్తే.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌తో ‘తేనెటీగ’ సినిమాను నిర్మించారు. వంశీ దర్శకత్వంలో నరేష్, వాణి విశ్వనాథ్‌ల కలయికలో వచ్చిన ‘ప్రేమ అండ్ కో’, శివకృష్ణతో ‘బొబ్బిలి వేట’, ‘బడి’ వంటి స్ట్రయిట్ సినిమాలతో పాటు.. పలు డబ్బింగ్ చిత్రాలను రామారావు నిర్మించి, నిర్మాతగా మంచి పేరును పొందారు. రామారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామారావు మృతి వార్త తెలిసిన వారంతా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, నివాళులు అర్పిస్తున్నారు. ‘తేనెటీగ’ రామారావు భౌతిక కాయాన్ని చూసి, కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు ఇండస్ట్రీలో ఆయనకు అత్యంత సన్నిహితులైన వారంతా వారింటికి చేరుకుంటున్నారు.
Also Read- Allu Arjun: కొత్త లుక్ లో అల్లు అర్జున్ .. ఈ సారి థియేటర్లు తగలపడిపోతాయి.. ఇది మాత్రం పక్కా
‘తేనెటీగ’ సినిమా విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్, సితార జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ‘ముద్దుల్ కావలెనా? మురిపాల్ కావలెనా’ అనే పాట ఎంతో పాపులర్ అయింది. సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. రామారావు ఇంటి పేరు కాస్తా.. ‘తేనెటీగ’గా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన ‘తేనెటీగ’ రామారావుగా పిలవబడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు