Venu Swamy at Kamakhya Temple
ఎంటర్‌టైన్మెంట్

Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. ఆ గుడి పూజారులు బయటకు నెట్టేశారు

Venu Swamy: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy)కి అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయం (Kamakhya Temple)లో చేదు అనుభవం ఎదురైంది. తన అనుచరులతో కలిసి ఆలయానికి వెళ్ళిన వేణు స్వామిని, అక్కడి ఆలయ పూజారులు, స్థానిక ప్రజలు తీవ్రంగా నిరసించి, బయటకు పంపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేణు స్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. సెలబ్రిటీలతో పూజలు చేయిస్తూ కనిపించే ఆయన, ఆ మధ్య నాగ చైతన్య, శోభిత (Naga Chaitanya and Sobhita)ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో బాగా వైరల్ అయ్యారు.

ఆ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా ఆ వార్తలు వెనక్కి తీసుకోవడమే కాకుండా, ఇకపై టాలీవుడ్‌కు సంబంధించిన వారి జాతకాలు చెప్పనని మీడియా వేదికగా తెలిపారు. అప్పటి నుంచి చాలా తక్కువగా వార్తలలో ఉంటున్న వేణు స్వామి.. మళ్లీ రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్‌లో పూజలు జరిపిస్తూ కనిపించారు. ఇప్పుడేమో.. ఇలా కామాఖ్య ఆలయ పూజారులతో నెట్టివేయబడుతూ కనిపించారు.

Also Read- Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు.. చవితి రోజున ఈ నైవేద్యాలు ట్రై చేయండి!

కామాఖ్య ఆలయంలో ఎందుకు అడ్డుకున్నారు?
వేణు స్వామిని అడ్డుకోవడానికి ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయని ఆలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదటిది, లక్షల రూపాయల పూజలు. కామాఖ్య ఆలయం ఆధ్యాత్మికతకు, తక్కువ ఖర్చుతో కూడిన పూజలకు పేరుగాంచింది. కానీ, వేణు స్వామి తాను చేసే పూజలకు, పరిహారాలకు లక్షల రూపాయలు వసూలు చేస్తారని, ఇది ఆలయ పవిత్రతకు విరుద్ధమని పూజారులు ఆరోపించారు. కామాఖ్య ఆలయం లాంటి పవిత్ర స్థలంలో ఇలాంటి వ్యాపార ధోరణిని సహించలేమని వారు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.

రెండవది, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించడం. వేణు స్వామి తరచుగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారనే విషయం తెలియంది కాదు. ఈ వ్యాఖ్యలు, ఆయన పూజల పద్ధతులు ఆలయ పవిత్రతను, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆలయ పూజారులు భావించారు. తమ ఆలయానికి వచ్చిన భక్తులకు సరైన మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, మోసపూరిత పద్ధతులను ప్రోత్సహించలేమని వారు పేర్కొన్నారు.

Also Read- Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!

ఈ సంఘటన కేవలం ఆలయ పూజారులు, వేణు స్వామి మధ్య వివాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న వ్యాపారాలపై, మోసాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని అంతా భావిస్తుండటం విశేషం. వేణు స్వామిని ఆలయం నుంచి బయటకు పంపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వివాదంపై వేణు స్వామి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!