Mega-Little-Prince(inage:X)
ఎంటర్‌టైన్మెంట్

Mega Little Prince: వారసుడిని చూసి మెగాస్టార్ కళ్లల్లో ఆనందం.. ఫొటోలు వైరల్!

Mega Little Prince: మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ తెలిపారు చిరంజీవి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ మొదటి సంతానంగా మగబిడ్డకు జన్మ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠికి సుఖప్రసవం జరిగిందని, తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యవంతులేనని కుటుంబ వర్గాలు నిర్ధారించాయి. విషయం తెలిసిన వెంటనే  మెగా స్టార్ చిరంజీవి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ తేజ్ దంపతులను కలుసుకుననారు. అప్పుడే పుట్టిన ఆ పసిబిడ్డను ఎత్తుకుని తెగ ఆనంద పడిపోయారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ చిన్నారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనిని చూసిన ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మూడోతరం వారసుడొచ్చాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-Swetcha Effect: ఆశ్రమ స్కూల్ లో అమానుషం.. స్వేచ్ఛ కథనానికి స్పందించిన అధికారులు.. పాఠశాలలో విచారణ

ఇప్పటికే వారసుడు లేడు అంటూ బాధ పడుతున్న మెగాస్టార్ కి ఈ విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ కథ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రొమాంటిక్ టేల్. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో కలిసిన ఈ ఇద్దరూ, అక్కడే ప్రేమలో పడ్డారు. ‘అంతరీక్షం 9000 కిలోమీటర్లు’ వంటి సినిమాల్లో కలిసి పనిచేసిన తర్వాత, వారు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేశారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ వెడ్డింగ్‌లో మెగా ఫ్యామిలీ సభ్యులైన రామ్ చరణ్, అల్లు అర్జున్, పంజా వైష్ణవ్ తేజ్, సై రాజరాజ్ వంటి సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వివాహం తర్వాత ఇద్దరూ కూడా తమ కెరీర్‌ను కొనసాగించారు. కానీ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.

Read also-YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

వరుణ్ తేజ్ ఇటీవల ‘మట్కా’ సినిమాలో నటించారు, ఇది పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తన తదుపరి సినిమా మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో హారర్ కామెడీగా రాబోతోంది. లావణ్య త్రిపాఠి ఇటీవల ‘హ్యాపీ బర్త్‌డే’ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’లో కనిపించింది. తన తదుపరి సినిమా ‘సతి లీలావతి’లో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో కలిసి నటిస్తోంది. వీరిద్దరూ వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు.

Just In

01

Nayanthara: ఐదు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందే.. నయనతారకు కొత్త చిక్కులు!

MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Army Recruitment Rally: యువతకు గుడ్ న్యూస్.. హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. వివరాలు ఇవే!

Allu Arjun- Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ

MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..