varun-sandesh(image source : X)
ఎంటర్‌టైన్మెంట్

Varun Sandesh: వరుణ్ సందేశ్ హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభం

Varun Sandesh: ‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారు లోకం’ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు వరుణ్ సందేశ్. తాజాగా ‘వన్ వే టికెట్’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు జూలై 27న నిర్వహించారు. ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాతలు సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

read also- Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?

త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. ‘మా డార్లింగ్ వరుణ్ సందేశ్‌కు ఓ హిట్ ఇవ్వాలన్నదే నా కల. ఈ ‘టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘‘వన్ వే టికెట్’ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో నేను కొత్త పాత్రను పోషించబోతోన్నాను. మా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. కుష్బూ, మనోజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు.’ అని అన్నారు.

read also- Vijay Deverakonda: కొండన్న ఈ మూవీ కూడా పోతే.. ఇంక నువ్వు అండర్ గ్రౌండ్ కే.. విజయ్ ని ఘోరంగా అవమానిస్తున్న ట్రోలర్స్

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై ఇది మా రెండో చిత్రం. అందరూ మా చిత్రానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు పళని స్వామి మాట్లాడుతూ.. ‘‘వన్ వే టికెట్’ క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది.’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ‘13 ఏళ్ల తరువాత మళ్లీ వరుణ్ సందేశ్‌తో కలిసి పని చేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్ ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా శ్రీనివాస్ బెజుగమ్, సంగీత దర్శకుడిగా కార్తిక్ పని చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

TG Endowments Act: ఎండోమెంట్ యాక్ట్ సవరణ.. ఆలయ భూముల ఆక్రమణకు ఇక చెక్..!

Farah Khan Ali: ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, జరీన్ ఖాన్ అంత్యక్రియల మీడియా కవరేజ్‌పై ఫరా ఖాన్ అలీ తీవ్ర ఆగ్రహం

power sector reforms: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు..!

Kaantha Review: కాంతా మూవీ రివ్యూ.. భయాన్ని జయించి నిజం కోసం నిలిచిన కథ

Al-Falah Students: అల్ ఫలాహ్ యూనివర్శిటీ.. టెర్రర్ డాక్టర్స్ గురించి.. షాకింగ్ అనుభవాలు చెప్పిన స్టూడెంట్స్