vadde-naveen( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Vadde Naveen: రీ ఎంట్రీతో నవ్విస్తానంటున్న హీరో.. పోస్టర్ చూశారా..

Vadde Naveen: ఒకప్పటి స్టార్ హీరో అయిన వడ్డే నవీన్ కొంత గ్యాప్ తీసుకుని నవ్వించడానికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నిర్మాతగా, హీరోగా, “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు” అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రాఖీ పౌర్ణమి సందర్భంగా మూవీ టీం విడుదల చేసింది. వడ్డే జిష్ణు సమర్పణలో “వడ్డే క్రియేషన్స్” బ్యానర్ మీద వడ్ఢే నవీన్ హీరోగా నిర్మాతగా చేస్తున్న చిత్రం “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు”. కమల్ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ తో పాటు కథ స్క్రీన్ ప్లే ను వడ్డే నవీన్ ఈ చిత్రానికి అందించడం విశేషం. ఇక ఈ మూవీలో వడ్డే నవీన్ కి జోడీగా రాసి సింగ్ నటిస్తున్నారు. ఈ మూవీకి కార్తిక్ సుజాత సాయికుమార్ కెమెరామెన్‌గా, కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడిగా, విజయ్ ముక్తావరపు ఎడిటర్‌గా పని చేశారు.

Read also- Nadikuda mandal: ఓట్లు ఒక చోట పనులు మరో చోట.. ధరి దాపు లేని ఊరు

వడ్డే నవీన్ తండ్రి శ్రీ వడ్డే రమేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వ్యవహరించేవారు. ఆయన సంస్థ అయిన “విజయ మాధవి కంబైన్స్” నుంచి ఎన్టీఆర్‌తో “బొబ్బిలి పులి”, మెగాస్టార్ చిరంజీవితో “లంకేశ్వరుడు”, రెబల్ స్టార్ కృష్ణరాజు తో “కటకటాల రుద్రయ్య”, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి ఎందరో పెద్ద పెద్ద స్టార్లతో చిత్రాలు నిర్మించి మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థగా రూపొందింది. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ కొనసాగింపుగా “వడ్డే క్రియేషన్స్” అనే బ్యానర్ ని స్థాపించి, వడ్డే నవీన్ తండ్రి బాటలో పయనించాలని నిర్ణయించుకుని ఇకపై “వడ్డే క్రియేషన్స్ బ్యానర్”లో సినిమాలు రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

Read also- Mass Jathara Teaser: ర‌వితేజ ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేది అప్పుడే..

అందులో భాగంగానే మొదట చిత్రం గా “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు” నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వడ్డే నవీన్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు” చిత్రం తో అందరిని అలరించబోతునారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్లుగా సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ “ఫస్ట్ లుక్” అందర్నీ ఆకట్టుకుంది. ఈ “ఫస్ట్ లుక్” పోస్టర్ ని గమనిస్తే కామెడీ యాంగిల్ కూడా వడ్డే నవీన్ ఇందులో మరింతగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ చిత్రంలో రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

Just In

01

Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Bigg Boss 9 Telugu: అతనికి మాత్రమే సపోర్ట్ చేస్తూ.. బిగ్ బాస్ పై నాగబాబు సంచలన పోస్ట్

Local Body Elections: స్థానిక ఎన్నికలు ఎప్పుడు?.. ఎదురుచూస్తున్న ఆశావహులు..?

Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

CM Revanth Reddy: నేడు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన.. ఎక్కడంటే..?