Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ (Yogi Adityanath) సపోర్ట్ అందించారు. ఆ సపోర్ట్ ఏంటి? అసలెందుకు ఒక తెలుగు సినిమాకు యూపీ సీఎం సపోర్ట్ చేశారు? ఆయన వరకు ఈ సినిమా ఎలా వెళ్లింది? వంటి విషయాల్లోకి వెళ్లేముందు ‘కన్నప్ప’ను గురించి కాస్త పరిచయం చేసుకుందాం. విష్ణు మంచు టైటిల్ పాత్రలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీలో ఏ హీరో చేయని విధంగా, ఏ హీరో సినిమాకు పెట్టని భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
Also Read- Mark Shankar: ఆస్పత్రిలో పవన్ తనయుడు.. ఫొటో చూస్తే గుండె తరుక్కుపోతుంది
మేకింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. విడుదల తేదీని కూడా వాయిదా వేసుకుంటూ సినిమా కోసం, కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ‘కన్నప్ప’ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా ‘కన్నప్ప’ గురించి మాట్లాడుకునేలా చేస్తూ పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేశాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ‘కన్నప్ప’ టీమ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి, చిత్ర విశేషాలను ఆయనతో పంచుకున్నారు. (Kannappa Promotions)

మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ‘కన్నప్ప’ టీమ్‌ను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి ‘కన్నప్ప’ టీమ్ కూడా ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు ఈ సందర్భంగా బహూకరించారు. అనంతరం ‘కన్నప్ప’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేయించారు. ఈ పోస్టర్ ప్రకారం జూన్ 27న (Kannappa Release Date) ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్‌గా ‘కన్నప్ప’ వాయిదాకు సంబంధించి టీమ్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తున్నామని, అతి త్వరలో మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని టీమ్ తెలిపిన విషయం తెలిసిందే.
Also Read- Sudigali Sudheer: హిందూ దేవుళ్లపై తమాషాలా? సుధీర్ స్కిట్‌పై రచ్చ రచ్చ!
‘కన్నప్ప’ టీమ్ చెప్పినట్లు రిలీజ్ డేట్‌ని ప్రకటించింది.. కాకపోతే యూపీ సీఎంతో ఇలా రివీల్ చేస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించనిది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్‌తో ప్రస్తుతం కన్నప్ప ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ ‘కన్నప్ప’ సినిమాను నిర్మిస్తుండగా, ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు