Sudigali Sudheer and Rambha
ఎంటర్‌టైన్మెంట్

Sudigali Sudheer: హిందూ దేవుళ్లపై తమాషాలా? సుధీర్ స్కిట్‌పై రచ్చ రచ్చ!

Sudigali Sudheer: ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. హిందూ దేవుళ్లు ఉన్న బట్టలను శరీరంపై ధరించి హేళన చేస్తున్నారు. ఇతర మతాల విషయంలో, దేవుళ్ల విషయంలో మాత్రం ఇంత ధైర్యంగా ఏ ఒక్కరూ పోస్ట్‌లు పెట్టడానికి సాహసించరు. కానీ, హిందూ మతం లేదంటే హిందూ దేవుళ్లు అంటే చాలు.. చాలా చులకన భావం ఎక్కువైంది. అందుకే పవన్ కళ్యాణ్ వంటి వారు సనాతన ధర్మం పేరుతో పోరాటానికి దిగారు. ఆమధ్య బాలీవుడ్ హీరోయిన్, తమిళనాడు డిప్యూటీ సీఎం.. ఇలా ఎవరు పడితే వారు హిందూ దేవుళ్లను అవమానించే పనులకు పూనుకోవడం, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం పరిపాటి అయిపోయింది. ఇప్పుడు లిస్ట్ లోకి జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా చేరాడు.

Also Read- Jr NTR: పవనన్నా.. కాస్త ధైర్యంగా ఉండన్నా!

తాజాగా ఆయన ఓ బుల్లితెర ప్రోగ్రామ్ కోసం చేసిన స్కిట్ (Sudigali Sudheer Skit) వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ స్కిట్‌ని పోస్ట్ చేసి, హిందూ మత పెద్దలు కొందరు సుడిగాలి సుధీర్‌పై ఫైర్ అవుతున్నారు. ‘హిందూ దేవుళ్లను ఎగతాళి చేసి, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వీళ్లకి పరిపాటి అయిపోయింది. సాక్షాత్తూ ఆ పరమశివుడి వాహనం నందీశ్వరుని కొమ్ముల నుంచి చూస్తే రంభ ఈ లుచ్చా గాళ్లకు శివుడిలా కనిపిస్తున్నాడంట. ఇంకోసారి ఇలాంటి స్క్రిప్టులు రాయకుండా, చేయకుండా వీళ్లకి తగిన గుణపాఠం నేర్పాలి’.. హిందూ మతవాదులు సుడిగాలి సుధీర్‌పై, ఆయన చేసిన స్కిట్‌పై మండిపడుతున్నారు.

అసలు ఈ వీడియోలో ఏముందంటే.. యాంకర్ రవి (Anchor Ravi) చాలా మహత్తరమైన గుడి బావ, ఒక్కసారి నంది కొమ్ముల నుంచి స్వామివారిని చూడు, అద్భుతంగా కనబడతారు అంటూ.. రవి, సుడిగాలి సుధీర్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. రవి చూడమని చెప్పగానే, నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి సుడిగాలి సుధీర్ చూస్తే.. ఎదురుగా రంభ (Rambha) కనిపిస్తుంటుంది. మళ్లీ కాస్త కళ్లు పెద్దవి చేసుకుని చూసిన సుధీర్‌కు, రంభ క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడు సుధీర్.. నాకేంటి అమ్మోరు కనిపిస్తుంది.. అని అనగానే.. రంభ.. ‘బావగారు, బావగారు.. బాగున్నారా’ అంటూ సీన్‌లోకి ఎంటరైంది.

వాస్తవానికి ఇది ‘బావగారూ బాగున్నారా’ సినిమాలోని సీన్. దీనిని కామెడీ కోసం, అందులో రంభ వస్తుందని సుధీర్ అండ్ టీమ్ ఇలా స్కిట్ చేశారు. ఇప్పుడీ స్కిట్‌పై నానా రచ్చ జరుగుతుంది. సాక్షాత్తూ శివునితో పరాచకాలు ఆడుతున్నారా? అంటూ హిందూ సంఘాల నేతలు ఈ వీడియోని షేర్ చేస్తూ.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ఇది సినిమాలో స్ర్కిప్ట్, ప్రతిదానిని భూతద్ధంలో చూడకండి అంటూ హిందూ సంఘాల నేతల కామెంట్స్‌కు సమాధానాలిస్తున్నారు.

Also Read- NTRNeel: ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

అయినా సరే, ‘అప్పుడెప్పుడో సినిమాలో వచ్చిన సీన్‌ని ఇప్పుడిలా చేశారు కదా అని వదిలేస్తే.. అదే అందరికీ అలవాటు అయిపోతుంది. ఒకసారి గట్టిగా చెప్తే మళ్లీ రిపీట్ కాకుండా ఉంటుంది’ అంటూ నెటిజన్లకు హిందూ సంఘాల నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. చూస్తుంటే ఈ వివాదం పెద్దది అయ్యేలానే ఉంది. ఎందుకైనా మంచిది.. సుధీర్ అండ్ టీమ్ త్వరగా క్షమాపణలు చెప్పి, మళ్లీ ఇటువంటివి రిపీట్ కానివ్వమని అంటే బెటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్