Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియంది కాదు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అంటూ ఆ మధ్య వార్తలు రాగా, ఇటీవల మైత్రీ నిర్మాతలలో ఒకరు, సినిమాను వేసవికి ప్లాన్ చేస్తున్నామని, ఏప్రిల్‌లో విడుదల ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఇక ఇప్పట్లో అప్డేట్స్ ఏమీ రావని అంతా అనుకుంటున్న సమయంలో.. తాజాగా మేకర్స్ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.
Also Read- Nov 2025 Hits And Flops: నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ఏవి హిట్? ఏవి ఫట్?
ఇదే ఇదే కావాలి
సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల అంటూ, డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఊహించని ఈ సర్‌ప్రైజ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు, డిసెంబర్‌లో నెలలోని అక్షరాలను డిప్యూటీ సీఎమ్ వచ్చేలా వారు అమర్చిన తీరు కూడా ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోంది. ఈ సర్‌ప్రైజ్ వీడియోతో ఎప్పుడెప్పుడు పాట వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ ట్వీట్‌కు ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియోను గమనిస్తే.. దర్శకుడు హరీష్ శంకర్ తనకు కావాల్సిన విధంగా పవన్ కళ్యాణ్‌తో స్టెప్ వేయించుకుంటున్నారు. ముందు నార్మల్‌గా పవన్ కళ్యాణ్ స్టెప్ వేసినా, కోటు పట్టుకుని వేసిన స్టెప్‌తో.. ‘ఇదే ఇదే కావాలి’ అంటూ హరీష్ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. వైరల్‌గా దూసుకెళుతోంది.
మెయిన్ తారాగణం వీరే..
ఈ సినిమాపై ఉన్న అంచాలను అందుకునేందుకు హరీష్ శంకర్ అండ్ టీమ్ ఎంతగా కృషి చేస్తున్నారో.. హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్‌ను చూడగానే ఎలా పూనకాలు వస్తాయో.. అనేదానికి ఉదాహరణగా ఈ వీడియో ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాబోయే పాటను కూడా ఆయనే ఆలపించినట్లుగా, తాజాగా వచ్చిన వీడియో చూస్తే తెలుస్తోంది. ఆనంద్ సాయి వేసిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లుగా ఈ వీడియో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్ట్‌ను ఎప్పుడో పూర్తి చేశాడనేలా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడనేది అతి త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
The energy you love.
The dance you enjoy.
The attitude you celebrate.
The man you worship.All this in one single song envisioned by our CULT CAPTAIN @harish2you 💥💥#UstaadBhagatSingh first single announcement very soon ❤🔥#DeCeMberMonth will be celebrated 🕺🥳
POWER… pic.twitter.com/bMF8CKIRlQ
— Mythri Movie Makers (@MythriOfficial) December 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
