Upendra re release: కల్ట్ ఫ్యాన్స్ కు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఆయన డైరెక్షన్లో హీరోగా వచ్చిన ఉపేద్ర సినిమా అక్టోబర్ 11న రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పడు సంచలనంగా మారింది. కన్నడ సినిమా పరిశ్రమలో ఒక మైలు రాయిగా నిలిచింది. హీరోయిన్‌గా ప్రీమా, మరో ముఖ్య పాత్రలో దమిని సుందర్‌లాల్ నహాటా నటించారు. సంగీతం గురుకిరణ్ అందించారు. శైలేంద్ర బాబూ నిర్మాతగా వ్యవహరించారు. హరి కృష్ణ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. కల్ట్ క్లాసిగ్ గా వచ్చన ఈ సినిమాకు ఇప్పుడు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దానిని గ్రహించిన నిర్మాతులు తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిని చూసిన ఉపేంద్ర ఫ్యాన్స్ సంబారాలు చేసుకుంటున్నారు.
Read also-Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ఈ సినిమా కేవలం ఒక కథ కాదు. ఇది ఒక మనిషి తన అంతరాత్మను తెలుసుకునే ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. కథలో ‘ఉప్పి’ అనే వ్యక్తి తన జీవితం, తన స్వభావం, మరియు “నేను ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతాడు. ప్రేమలో, విజయాలలో, అహంకారంలో, మరియు స్వార్థంలో మునిగిపోయిన అతడు చివరికి తన అహంభావం కారణంగా పతనమవుతాడు. సినిమా చివరలో ఉపేంద్ర మనిషి మనసు ఎంత గందరగోళంగా ఉంటుందో, దాన్ని అర్థం చేసుకోవడమే జీవిత సత్యమని చూపించాడు. అందుకే ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. ప్రత్యేకంగా మైత్ర మూవీమేకర్స్ ధయోటర్ అయిన విమల్ థ్రియోటర్లో స్పెషల్ షో వేస్తున్నారు. సింగిల్ థియో టర్లలో విమల్ అతి పెద్ద స్క్రీన్ కావడంతో ఉపేంద్రను పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ గ్రాంగ్ గా విడుదల కావడంతో ఉపేంద్ర ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కల్ట క్లాసిక్ చూసేందుకు అభిమానులే కాంకుండా సగటు సినిమా ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం 11 వరకూ అగాల్సిందే.
Bookings Open Now for the CULT CLASSIC #UPENDRA at the Biggest Single Screen of Telangana Mythri Vimal 70 MM 🔥🔥
BOOK NOW 🎟️ https://t.co/19VPrRidl2
Grand Re-Release in Telugu on October 11th💥
NIZAM Release by @MythriRelease ✨@nimmaupendra #SrinivasaProductions #PatiSudev pic.twitter.com/0d9W3UYg1J— Mythri Theatres (@MythriTheatre) October 9, 2025
