Upasana: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అందులోనూ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందని సినీ ఇండస్ట్రీ నమ్ముతోంది. సరే ఆ విషయం ఇలా ఉంటే, ఇప్పుడు రామ్ చరణ్‌కు సంబంధించి ఉపాసన రివీల్ చేసిన ఓ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ విషయం ఏమిటంటే..
Also Read- Kannappa Film Actress: ‘కన్నప్ప’ హీరోయిన్ ఎక్కడ? టాలీవుడ్ నుంచి దుకాణం సర్దేసినట్టేనా?
ముందుగా ఉపాసన గురించి చెప్పుకోవాలంటే.. అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నిర్వహిస్తూనే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలెన్నో చెబుతూ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఓ బాధ్యతను కూడా అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో ఛైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నికైన విషయం తెలిసిందే. ఇంకా క్లీంకారను కంటికి రెప్పలా చూసుకుంటూ.. ఎన్నో విషయాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌కు సంబంధించి ఇష్టమైన ఫుడ్, ఇతరత్రా విషయాలను తెలియజేశారు.
అందులోనూ ముఖ్యంగా చెప్పిన విషయం రామ్ చరణ్ వాడే మొబైల్ సిమ్స్ గురించి. ఇప్పటి వరకు రామ్ చరణ్ 199 సిమ్ కార్డులు మార్చారట. ఇప్పుడు వాడే సిమ్ 200వ ది అని తెలిపింది. అంతేకాదు, తన ఫోన్‌లో రామ్ చరణ్ పేరును సేవ్ చేసుకోవడానికి కూడా సిమ్ సంఖ్యను యాడ్ చేసి సేవ్ చేసుకుంటుందట. ప్రస్తుతం ‘రామ్ చరణ్ 200’ అని సేవ్ చేసుకున్నట్లుగా ఉపాసన ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే తను ఎక్కడికి వెళ్లినా, ఇంటి ఫుడ్ ఉండేలా చూసుకుంటారని, అందుకే అత్తమ్మాస్ కిచెన్ ప్రారంభించినట్లుగా చెప్పుకొచ్చారు.
Also Read- Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
ఇక సిమ్ విషయానికి వస్తే.. సెలబ్రిటీలు అన్నాక ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. నెంబర్ ఎవరికైనా తెలిసినప్పుడు.. వెంటనే మార్చకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియంది కాదు కాబట్టి.. ఉపాసన చెప్పిన ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో రామ్ చరణ్ సినిమా చేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు