Preeti Mukundan
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Film Actress: ‘కన్నప్ప’ హీరోయిన్ ఎక్కడ? టాలీవుడ్ నుంచి దుకాణం సర్దేసినట్టేనా?

Kannappa Film Actress: మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం విడుదల రోజు పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమా కూడా మంచు ఫ్యామిలీ (Manchu Family) కి లాస్‌నే మిగిల్చినట్లుగా ట్రేడ్ రిపోర్ట్ ఆల్రెడీ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు ఫ్యామిలీ కూడా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ తర్వాత ఎక్కడా కూడా ఈ సినిమా ప్రస్తావనను ఆ ఫ్యామిలీ తీసుకురాలేదు. ఇక ఈ సినిమాలో ఎంత మంది స్టార్స్ చేసినా వారికేం కాదు కానీ, ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రీతి ముకుందన్‌ (Preeti Mukundan) మాత్రం.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

Also Read- Allu Aravind: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

అవును, ఇది భక్తి ప్రధాన చిత్రమైనా, తన గ్లామర్‌తో రక్తి కట్టించిన ప్రీతి ముకుందన్, ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవుతానని అనుకుంది. అందుకే, గ్లామర్‌గా కనిపించేందుకు అస్సలు వెనుకాడలేదు. వాస్తవానికి ఈ పాత్రకు ముందుగా కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఏం జరిగిందో ఏమో.. కొంతమేర షూటింగ్ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో ప్రీతి ముకుందన్ వచ్చి చేరింది. కానీ, సినిమా ప్రమోషన్స్ నాటికి.. ఈ భామ కూడా ఎక్కడా కనిపించలేదు. ‘కన్నప్ప’కు సంబంధించి జరిగిన ఏ ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ ప్రీతి చప్పుడు చేయలేదు. కారణం ఏమై ఉంటుందనేది ఎవరికీ తెలియదు కానీ, సినిమా విడుదల తర్వాత అసలు టాలీవుడ్‌లో కనిపించే పరిస్థితే లేకుండా పోవడం చూస్తుంటే.. బ్యాక్‌గ్రౌండ్‌లో జరగరానిదేదో జరిగే ఉంటుందనేలా అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం విశేషం.

Also Read- Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో పరిచయమైనా.. ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. సినిమా మంచి విజయం సాధించినా కూడా ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో.. వెంటనే టాలీవుడ్‌లో ఆమెకు అవకాశం రాలేదు. ఆ తర్వాత కోలీవుడ్‌లో చేసిన ‘స్టార్’ మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా సక్సెస్‌తో ‘కన్నప్ప’ టీమ్ కళ్లలో పడ్డ ప్రీతికి.. మంచి పాత్రే లభించింది కానీ, సినిమా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్‌కు ఆమె టాటా చెప్పేసిందనేలా టాక్ మొదలైంది. ప్రస్తుతం తమిళ్, మలయాళంలో రెండేసి ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ కారణంగా టాలీవుడ్ వైపు చూడటం లేదో, లేదంటే.. ఆమెను టాలీవుడ్ వైపు చూడకుండా చేశారో తెలియదు కానీ.. ‘కన్నప్ప’లో ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన వాళ్లంతా బాగా డిజప్పాయింట్ అవుతున్నారనేది మాత్రం నిజం. చూద్దాం.. మళ్లీ ఆమె టాలీవుడ్‌లో ఎప్పుడు అడుగు పెడుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?