Trivikram Srinivas: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాలంగా ఖాళీగానే ఉంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఒక సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. తీసుకోవడం లేదు.. అలా వస్తుంది అంతే. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత త్రివిక్రమ్ ఇంత వరకు సినిమా అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేష్ బాబు మాత్రం దర్శకధీరుడితో చేస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ‘గుంటూరు కారం’ సినిమా టైమ్‌లోనే, ఆ సినిమా పూర్తవ్వగానే మరోసారి అల్లు అర్జున్‌ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారనేలా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పాన్ వరల్డ్ ఫిల్మ్‌గా భారీ బడ్జెట్‌తో సినిమా ఉంటుందని, గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు. అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న ‘పుష్ప 2’ కూడా రిలీజై గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ, త్రివిక్రమ్ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.
Also Read- Balakrishna: వాళ్లని గదిలోకి తీసుకెళ్లి బాలయ్య ఏం చేసేవాడంటే.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!
మరోవైపు అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో సినిమా ప్రకటించి, సెట్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. మరి త్రివిక్రమ్ సంగతేంటి? సినిమాలు చేస్తాడా? లేదంటే, మానేసి జనసేన పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడా? అనేలా కూడా ఈ మధ్య ఆయనపై వార్తలు వచ్చాయి. ఎందుకంటే, ఎప్పుడు చూసినా ఏపీలోనే ఆయన దర్శనమిస్తున్నాడు. అలా ఆయనని చూసిన వారంతా, జనసేన పార్టీలో ఆయనకో కీలక పదవి కూడా రాబోతుందనేలా రూమర్స్ పుట్టించారు. ఆ వార్తల్లో నిజం లేదనుకోండి. అయితే, త్రివిక్రమ్ తదుపరి హీరో ఎవరు? ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనేంత క్యూరియాసిటీ ఏం అవసరం లేదులే కానీ, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్న హీరోకి సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త బాగా హైలెట్ అవుతుంది.
Also Read- Allu Aravind: ‘ఆపరేషన్ సింధూర్’.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం!
మొన్నటి వరకు అల్లు అర్జున్ హ్యాండిచ్చాడు కాబట్టి.. రామ్ పోతినేని (Ram Pothineni)తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందనేలా టాక్ నడిచింది. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయే హీరో ఆయన కూడా కాదని తెలిసింది. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
వెంకీ, త్రివిక్రమ్ కాంబో విషయానికి వస్తే.. గతంలో వెంకీ హీరోగా చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆ రెండు సినిమాలు వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు వెంకీని తనే స్వయంగా డైరెక్ట్ చేయబోతుండటంతో.. ఈ సినిమా ప్రకటన కంటే ముందే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు