Payal Rajput: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (68) జూలై 28, 2025 సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఢిల్లీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తన తండ్రితో ఉన్న గాఢమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పాయల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
“నాన్నా, నీవు నా పక్కన లేకపోయినా, నీ ప్రేమ నన్ను ఎప్పుడూ నడిపిస్తుంది. నీ నవ్వు, నీ మాట, నీ ఉనికి నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ లోకం నుంచి నీవు వెళ్లిపోయావు కానీ, నా హృదయం నుంచి ఎప్పటికీ వెళ్లవు. లవ్ యు ఫరెవర్, నాన్న!” అంటూ ఆమె పోస్ట్ లో రాసుకొచ్చింది.
Also Read: BRS Party Leaders: గ్రామస్థాయి బీఆర్ఎస్‌లో గ్రూపులు.. ఎమ్మెల్యేలు మాజీల అనుచరులదే పెత్తనం!
ఈ ముద్దుగుమ్మ RX 100, వెంకీ మామ, మంగళవారం లాంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించిన పాయల్, పంజాబీ సినిమా చన్నా మేరియాతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో వెంకటలచ్చిమి సినిమాతో పాటు కొత్త ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ విషాద సమయంలో పాయల్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. పాయల్ త్వరగా ఈ దుఃఖం నుంచి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
Also Read: Samantha: ఆ ఛాలెంజ్ లో సమంత గెలిచింది.. ఒక్క దెబ్బతో అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టేసిందిగా!