Ranya Rao Case
ఎంటర్‌టైన్మెంట్

Ranya Rao Case: రన్యా రావు భర్త బ్యాగ్రౌండ్‌ ఇదే!

Ranya Rao Case: ప్రముఖ కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టపడటం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసందే. బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయ్యింది. దుబాయ్‌ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుపడింది. దీంతో ఆమె దగ్గర నుంచి 14.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆమె ఇంట్లో సోదాలు చేసి, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో రూ.2 కోట్లకుపైగా నగదు సీజ్ చేశారు. ఈ కేసులో రన్యారావు నుంచి రూ.17.29కోట్ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇక గోల్డ్ స్మగ్లింగ్‌తో తన భర్త జితిన్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే తాజ్ వెస్ట్ ఎండ్‌లో రన్యా రావు-జితిన్‌ వివాహం నాలుగు నెలల క్రితం గ్రాండ్‌గా జరిగింది. బెంగళూరులో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఈ జంట నివాసం ఉంటుంది. జితిన్‌ వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్ట్ కాగా బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని ఆయన పొందాడు. లండన్‌లోని ఓ ఇన్స్టిట్యూషన్ లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నోవేషన్‌ స్పెషలైజేషన్‌తో ఉన్నత విద్యను అభ్యసించాడు. జతిన్ తొలుత బెంగళూరు రెస్టారెంట్ ఇండస్ట్రీని తన కొత్తరకమైన డిజైన్లతో తన మార్క్‌ను చూపించాడు. భారత్‌లో అనేక ప్రాంతాలతో పాటు లండన్‌లోనూ పలు కన్‌స్ట్రక్షన్స్‌కు డిజైన్లు ఇచ్చాడు. జితిన్‌కు WDA & DECODE LLC, క్రాఫ్ట్ CoDe అనే సంస్థలు స్థాపించాడు. హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ అండ్‌ ప్లానింగ్‌లో ఆయనకు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. అయితే జితిన్‌కు ఈ వ్యవహారంతో లింక్‌ ఉందా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: భ‌ర్తతో విడిపోవ‌డంపై నిహారిక‌ కామెంట్స్ వైరల్ 

ఇక ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రన్యారావు.. అందరూ ప్రయాణికులా వలే ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ చెకింగ్ చేసుకుంది. ఎలాంటి భయం లేకుండా సాధారణంగా కనిపించింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లోని ఓ కానిస్టేబుల్ హెల్ప్‌తో ఎగ్జిట్ మార్గం ద్వారా బయటికి వెళ్ళింది. కాపు కాసి రెడీగా ఉన్న డీఆర్‌ఐ అధికారులు ఆమెను ఆపి తనిఖీలు నిర్వహించారు. దీంతో రన్యారావు నడుముకు ధరించిన బెల్టులో కిలోల కొద్ది బంగారం గుర్తించారు. వెంటనే ఆ బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల పట్టుపడిన బంగారంలో ఇదే అతి పెద్దదని వెల్లడించారు. అయితే రన్యారావు పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. తనను ఈ స్మగ్లింగ్ చేయాలని ఒత్తిడి చేసారని, అంతేగాక బ్లాక్‌మెయిల్‌ చేశారని అందుకే చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. అయితే మరోవైపు ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడని ప్రచారం జరిగుతోంది. అయితే ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అనేది తెలియడం లేదు. ఈ కేసుపై విచారణ జరిగుతోంది. త్వరలో సంచలన విషయాలు బయటికి రానున్నాయి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?