Mahesh Babu: తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుకు (Mahesh Babu) బిగ్ షాక్ తగిలిన విషయం మనందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించలేని విధంగా ఈడీ నోటీసులు పంపించడంతో ఇండీస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు ఆదేశించారు.
ఇప్పటికే వీటికి సంబందించిన ఆధారాలను సేకరించారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మానీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని తమ ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేశ్‌కు నోటీసులు పంపించారు. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు మొత్తం రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల ఆధారాలను సేకరించారు. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నేడు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. విచారణకు వెళ్తే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారో చూడాలి.
Also Read: CM Chandrababu: ఫిషింగ్ హార్బర్ కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు.. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు!
దీనిపై రియాక్ట్ అయిన మహేష్ బాబు అభిమానులు మాత్రం ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. వామ్మో ఇది నిజమేనా.. అని వాళ్ళకి సందేహంగా ఉంది. మహేష్ అన్న కూడా ఇలా చేశాడా అంటూ షాక్ అవుతున్నారు. ఇంకొందరైతే యాడ్స్ ను చూసి పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదంటూ రియల్ ఎస్టేట్ వారిపై ఫైర్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు