Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ స్టేట్‌మెంట్ ఇవ్వడానికే ఈ పాట చేశారా.. అని యాంకర్ అడగగా.. ఆ ప్రశ్నకు సమంత ఇచ్చిన సమాధానం బాగా వైరల్ అవుతుంది. ” నేను వేరే వాళ్ళ కోసం స్టేట్‌మెంట్ ఇస్తానని కొందరు అనుకుంటారు. కానీ, నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడానికే చూస్తా.. నా లైఫ్ లో నన్ను నేను హాట్‌గా ఉన్నాను అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నేను ఆ యాంగిల్ లో నటించగలనో లేదో అని నన్ను నేను పరీక్షించుకోవడానికి ఊ అంటావా సాంగ్ చేశాను. ఇంతకు ముందు అలాంటి పాట ఎప్పుడూ చేయలేదు. కాబట్టి, ఇది నిజంగానే ఒక ఛాలెంజ్.. ఒక్కసారి మాత్రమే చేయాలనుకునీ చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదని ” సమంత తెలిపింది.
ఊ అంటావా పాట నాకు వచ్చినప్పుడు షాక్ అయ్యాను. ” స్పెషల్ పాట కోసం నన్ను ఎలా ఎంపిక చేశారు? దీనిలో చాలా హాట్‌గా కనిపించాలి. నేను ఇప్పటి వరకు క్యూట్, బబ్లీ పాత్రలే చేశా. ఈ యాంగిల్ లో నన్ను నేను చూసుకోవాలనిపించింది. నా చుట్టూ ఉన్నవాళ్లు ఈ పాట చేయొద్దని చెప్పారు. కానీ, నాకు లిరిక్స్ బాగా నచ్చేశాయి. పైగా ”ఇంతకు ముందు ఇలాంటి అవకాశం రాలేదు. ఎలా అయిన చేయాలని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. మొదటి షాట్ చేసే ముందు చుట్టూ 500 మంది జూనియర్ ఆర్టిస్టుల ఉన్నారు.. భయంతో వణికిపోయా ” అని సమంత తెలిపింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు