Jo Sharma: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ 2025(Oscars 2025) వేడుకలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని హీరోయిన్ జో శర్మ దక్కించుకున్నారు. ప్రముఖ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రంలో జో శర్మ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సందర్బంగా జో శర్మ మాట్లాడుతూ..ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ వేడుకలో భాగమవ్వడం ఓ గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం, కలుసుకోవడం ఓ మంచు అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఇక ఈ వేడుకను దగ్గర నుంచి చూడటం ఎంతో మధురమైన అనుభూతి పేర్కొంది. ఇక ‘ఎం4ఎం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జో శర్మ 40 అమెరికన్ సిటీస్ సందర్శించే ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు అందించాలని జో శర్మ కోరారు.
జో శర్మ ‘ఎం4ఎం’ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మోహన్ వడ్లపట్ల డైరెక్షన్ వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు హిందీలో రిలీజ్ కానుంది. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే స్టోరీతో ‘ఎం4ఎం’ సినీ ప్రేక్షకులను అలరించనుంది. ఇండియాతో పాటు అమెరికాలో విడుదల చేసే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ మూవీ ఆడియన్స్ ని ఎంతగానో కట్టుకున్నాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మూవీ స్టోరీ, దృశ్యకావ్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు థ్రిల్లర్ జానర్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. టాలీవుడ్ మూవీ వరల్డ్ వైడ్‌గా గుర్తింపు పొందేలా ‘ఎం4ఎం’ సక్సెస్ కావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఇక ఆస్కార్ 2025 వేడుకలో జో శర్మ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం జో శర్మ ఫోటోలు వైరల్‌గా మారాయి.
Also Read: సింగర్ కల్పన హెల్త్ అప్‌డేట్