Singer Kalpana
ఎంటర్‌టైన్మెంట్

Singer Kalpana: సింగర్‌ కల్పన హెల్త్ అప్‌డేట్

Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపుతోంది. నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కల్పన చికిత్స పొందుతోంది. బుధవారం ఉదయం కల్పన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులిటెన్ డాక్టర్లు విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని వెల్లడించారు. మరోవైపు కల్పన ఆత్మహత్యాయత్నంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వెనుక భర్త ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. అటు కల్పన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే ప్రసాద్ మాత్రం పని మీద రెండు క్రితం చెన్నై వెళ్లినట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది.

మరోవైపు కల్పన నివాసముంటున్న వర్టేక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డిని పోలీసులు అడిగి సమాచారం రాబడుతున్నారు. అయితే వెంకట్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం కల్పన భర్త ప్రసాద్..వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి, సహాయం కావాలని కోరాడు. అయితే ఆ సమయంలో ప్రసాద్ కాల్ చేస్తే కల్పన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ప్రసాద్ సీసీ కెమెరాలు పరిశీలించగా కల్పన అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించాడు. అదే విషయం తనకు ప్రసాద్ చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లగా బెడ్ పై కల్పన పడుకుని ఉంది. దీంతో పోలీసులు సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించాము. అయితే గత 5 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ రెండు రోజులుగా ప్రసాద్ ఇంట్లో లేనట్టు తెలుస్తుంది. కల్పన, ఆమె భర్త కలిసిమెలిసి ఉండేవారు. ఇద్దరు మధ్య ఫ్యామిలీ సమస్యలు ఉన్న విషయం తమకు తెలియదని చెప్పాడు. ఇక కల్పనని చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు, సింగర్స్ సునీత, శ్రీకృష్ణ తదితరులు వెళ్లారు.

Also Read: ప్రియుడికి హీరోయిన్ తమన్నా బ్రేకప్?

ఇక కల్పన సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో హిట్స్ పాడి అందరిని మైమరపించింది. మెలోడి సాంగ్స్‏తోపాటు అనేకమైన పాటలు పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి అనే పాటలు ఆలపించారు. బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొని అలరించారు. అయితే ఆమె ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అందరిని కలిచివేసింది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?