Tamannaah
ఎంటర్‌టైన్మెంట్

Tamannaah: ప్రియుడికి హీరోయిన్ తమన్నా బ్రేకప్?

Tamannaah: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ అనేది కామన్ అయిపోయింది. కొందరు పెళ్లి చేసుకుని మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరి పెళ్లి వరకు వెళ్లి లవ్ బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అయితే స్టార్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నారని, ఏమైందో ఏమో కానీ వారి బంధాన్ని బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమన్నా భాటియా.. ముట్టుకుంటే మాసి పోయేలా ఉండే ఈమెను అభిమానులు ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుచుకుంటారు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో టాప్ హీరోలు అందరితో యాక్ట్ చేసింది ఈ భామ. తనదైన నటన, అందంతో సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించిన ‘శ్రీ’ అనే చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తరువాత ‘హ్యాపీ డేస్’ మూవీలో నటించింది. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి తమన్నాకు అవకాశాలు తన్నుకుని వచ్చాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి.. తెలుగులో ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లో కూడా రాణించాలనే కోరికతో అక్కడికి వెళ్ళింది. పలు స్టార్ హీరోలతో నటించింది.

ఇక ‘లవ్ స్టోరీ 2’ అనే వెబ్ సిరీస్‌లో విజయవర్మతో తమన్నా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. దీంతో విజయవర్మతో తమన్నా డేటింగ్‌లో ఉందని.. త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్‌లో చర్చ నడిచింది. అయితే తాము స్నేహితులమని, తమ మధ్య ఏమి లేదని మొదట క్లారిటీ ఇవ్వగా.. ఆ తరువాత విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. మరోసారి మీడియా నుంచి ఇదే ప్రశ్న వారికి ఎదురవ్వగా… అవునూ తాము ఇద్దరు ప్రేమించుకుంటున్నామని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ప్రకటించారు. 2023 న్యూ ఇయర్ రోజున హాగ్ చేసుకుంటూ.. కిసులు పెట్టనున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా సంగతి తెలిసిందే.

Also Read: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం 

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తమన్నా లవర్ విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలో పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి బ్రేకప్ వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరు ప్రేమికులుగా విడిపోయిన స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నారట. మరోవైపు తమన్నా, విజయ్ వర్మ విడిపోయి చాలా కాలం అయ్యిందని సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై ఈ జంట అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్