MOTEVARI(image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Mothevari Love Story: తెలంగాణ పల్లె పదాలతో ఆస్కార్ విన్నర్ పాడిన పాట..

Mothevari Love Story: స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాత‌లు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సిరీస్ నుంచి ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సిరీస్ భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జీ5లో స్ట్రీమింగ్ కానుంది. జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది.

Read also- Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు

ఈ పాట ప్రస్తుతం యువత వాడుతున్న సామాజిక మాధ్యమాల్లోని కొన్ని పదాలను వాడుతూ రాసుకొచ్చారు. యూట్యూబ్ లో వాడే పదాలను తెలంగాణ పల్లెపదాలతో కలిపి మంచి మెలొడీ వచ్చేలా స్పరపరిచారు. ఈ పాట సాహిత్యం సోషల్ మీడియాలో యువత ఉపయోగించే ఆధునిక పదాలను తెలంగాణ గ్రామీణ పదజాలంతో అద్భుతంగా మేళవించింది. ఇలీవల బాగా పాపులర్ అయిన‘గిబిలి’ వంటి పదాలు యువత భాషలోన ఉత్సాహాన్ని తెలియజేస్తాయి. చరణ్ అర్జున్ సంగీతం జానపద లయలతో ఆధునిక బీట్స్‌ను కలిపి, గ్రామీణ వాతావరణాన్ని సజీవంగా చిత్రీకరిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం పాటకు శక్తిని, హాస్యాన్ని జోడించింది. ఇస్టాగ్రామ్, యూట్యూబ్ చానల్, వ్యూస్, వైరల్ కంటెంట్ అనే టెక్నికల్ పదాలు యువతకు బాగా నచ్చేవిగా ఉంటాయి.

Read also- GHMC Commissioner: స్పెషల్ డ్రైవ్ విజయవంతం చేయాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

హీరోయిన్‌కు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను హీరో వ్యక్తం చేసే క్రమంలో ‘గిబిలి గిబిలి’ పాట వ‌స్తుంది. సోష‌ల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉప‌యోగించే ప‌దాల‌తో ఈ పాట‌ను రాయ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మ‌ల్లెగోడ గంగ ప్రసాద్ రాసిన ఈ పాట‌ను రాహుల్ సిప్లిగంజ్ పాడ‌గా, చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చారు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?