Dude Movie Stills
ఎంటర్‌టైన్మెంట్

Dude: తేజ్ టీజర్ వచ్చేస్తుంది ‘డ్యూడ్’.. మ్యాచ్‌కి సిద్ధమా!

Dude: మల్టీ టాలెంటెడ్ పర్సన్ తేజ్ (Tej) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కన్నడ, తెలుగు, మలయాళ త్రిభాషా చిత్రం ‘డ్యూడ్’. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని.. ఫుట్ బాల్ ప్రేమికుడైన దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు అంకితం చేస్తున్నారు. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అతి త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్ విడుదల తర్వాత సినిమాను చూసే కోణమే మారిపోతుందని చిత్రబృందం తెలుపుతోంది.

Also Read- Sanjay Kapur: కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి.. కారణం తెలిస్తే షాకవుతారు

ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ.. హీరోగా, డైరెక్టర్‌గా ‘డ్యూడ్’ చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటి వరకు పూర్తయిన షూటింగ్ రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అంతేకాదు, ఎప్పుడెప్పుడు ప్రేక్షకులతో కలిసి థియేటర్స్‌లో సినిమా చూసుకుంటామా? అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టెక్నికల్‌గా అత్యద్భుతంగా చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. అలాగే ఇందులో నటించే నటీనటులందరి పాత్రలు, ప్రేక్షకులను మెప్పిస్తాయి. ప్రతి పాత్రకు ఇందులో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం టీజర్ కటింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి, ఆ తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తాం. కన్నడ, తెలుగు, మలయాళ ప్రేక్షకులను ఆకర్షించే కంటెంట్ ఇందులో ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకముందని అన్నారు.

Also Read- Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్, ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్‌’గా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష వంటి వారంతా ఇందులో ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తుండగా.. సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘జింకే మారి’ ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం అందిస్తుండగా.. ‘అలా మొదలైంది’ ఫేమ్ ప్రేమ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?