Surveen Chawla: బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కెరీర్ ఆరంభంలో ఆమె తెలుగు సినిమాలో నటించింది. మోహన్ బాబు, శర్వానంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజు మహారాజు’ మూవీలో సుర్వీన్ చావ్లా హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. మళ్లీ 5 సంవత్సరాల తర్వాత 2014లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘జై హింద్ 2’లో హీరోయిన్‌గా కనిపించింది. ఈ గ్యాప్‌లో హిందీ, పంజాబీ చిత్రాలలో నటించి, నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించిన సుర్వీన్ చావ్లా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Also Read- Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!
ఆమె బాలీవుడ్‌కి చెందిన ఎవరి పేరైనా చెప్పి ఉంటే.. అంతగా హైలెట్ అయ్యేది కాదు. కానీ, సౌత్‌కి చెందిన, అందునా జాతీయ అవార్డు పొందిన దర్శకుడు అంటూ ఆమె రివీల్ చేసిన విషయాలు టాక్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీగా మారాయి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో.. ఇంతకీ ఎవరా జాతీయ అవార్డు పొందిన దర్శకుడు అంటూ అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూతో సుర్వీన్ చావ్లా నెట్ ప్రపంచంలో ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయనేలా కూడా కొందరు మాట్లాడుకుంటూ ఉండటం విశేషం. అసలింతకీ సుర్వీన్ చావ్లా ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే..
#SurveenChawla, actress from #Rana Naidu, shared her casting couch experience involving a Tamil director who asked 4her “commitment.”
She revealed that both d director & the actors involved were National Award winners.@GemsOfBollywood #BoycottBollywood pic.twitter.com/zJKrXwC6hH
— Ashu🇮🇳 (Sushant Ka Parivar) (@Ashu31stDec) May 31, 2025
కోలీవుడ్‌లో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక జాతీయ ఉత్తమ నటుడి సినిమాలో అవకాశం అని నేషనల్ అవార్డు పొందిన దర్శకుడు నన్ను ఆడిషన్, లుక్, స్క్రీన్ టెస్ట్ చేయడానికి పిలిపించారు. మార్నింగ్ నుంచి జరిగిన ఈ ప్రాసెస్‌లో నాకు తమిళం, ఆ దర్శకుడికి హిందీ రాకపోవడంతో.. నేను మాట్లాడేది తెలుసుకోవడానికి ఆయన ఓ మీడియేటర్‌ని ఏర్పాటు చేశారు. అవన్నీ ముగించుకుని నేను ముంబై వచ్చేసిన తర్వాత ఆ మీడియేటర్ నాకు ఫోన్ చేశాడు. ‘మీ లుక్ టెస్ట్ ఓకే అయింది. డైరెక్టర్ గారికి మీరు బాగా నచ్చారు. కానీ ఆయన మీతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నారు’ అని అనగానే.. ముందు నాకు స్ట్రయిక్ అవలేదు. అతను మాట్లాడుతున్నప్పుడు నిదానంగా నాకు అర్థమైంది. వెంటనే.. ‘అంటే మీ డైరెక్టర్‌తో నన్ను పడుకోమని అడుగుతున్నారా’ అని సూటిగా అడిగేశాను. అతను మళ్లీ మాట్లాడలేదు. నేను కళను నమ్ముకుని వచ్చాను. నాకు అలాంటివి చేతకాదు, అందుకోసమే అయితే.. మీ ప్రాజెక్ట్‌లో నేను చేయను అని ఫోన్ పెట్టేశానని సుర్వీన్ చావ్లా చెప్పుకొచ్చింది.
Also Read- Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రుడు.. కమెడియన్ అలీపై బూతు మాట!
మరో సందర్భంలో ఏ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడనేది చెప్పలేదు కానీ.. దర్శకుడితో చర్చల అనంతరం నేను వెళుతున్నప్పుడు.. ఓ దర్శకుడు నాకు చాలా దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోబోయాడు. అప్పటికి నాకు పెళ్లి కూడా అయింది. వెంటనే తేరుకుని ఆ దర్శకుడిని నెట్టి వేసి, అక్కడి నుంచి జారుకున్నాను.. అని ఈ ‘రానా నాయుడు’ (Rana Naidu) బ్యూటీ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ వివరాలను బయటపెట్టింది. అయితే ఆ జాతీయ ఉత్తమ దర్శకుడు ఎవరనేది మాత్రం.. ఆమె చెప్పలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు