Suriya X Chandoo Mondeti: కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య(Suriya) వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఆయన మంచి స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకొని మంచి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు, విమర్శకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కార్తిక్ సుబ్బరాజ్‌తో ‘రెట్రో’, ఆర్జే బాలాజీతో ‘సూర్య 45’ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలపై భారీ అంచనాలతో పాటు పాజిటివ్ ఒపీనియన్ ప్రోజెక్ట్ అవుతూ వస్తుంది. కానీ ఆ తర్వాత ఆయన వరుసగా టాలీవుడ్ డైరెక్టర్లతో చేతులు కలపడం కొందరికి ఆందోళన కలగజేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇప్పటికే వాతి(సార్), లక్కీ భాస్కర్(Lucky Baskhar) వంటి సినిమాలతో సెన్సేషనల్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి(Venky Atluri)తో ‘సూర్య 46’ ఫిక్స్ అయిపోయింది. అనంతరం ఆయన రీసెంట్ గా ‘తండేల్’ (Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా చందూ మొండేటి(Chandoo Mondeti)తో పని చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ ఇద్దరి ప్రాజెక్టులపై సంతకం కూడా పెట్టేశాడు. ఈ నేపథ్యంలోనే కొందరు తమిళ్ సూర్య ఫ్యాన్స్, తెలుగు సూర్య ఫ్యాన్స్ తో పాటు విమర్శకులు కొంచెం అసహనం వ్యక్త పరుస్తున్నారు. ఎందుకంటే.. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినా ఈ డైరెక్టర్లపై కొన్ని వర్గాల అభిమానులకు, విమర్శకులకు నమ్మకం కుదరడం లేదు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
ప్రత్యేకంగా చందూ మొండేటి.. ఈ డైరెక్టర్ డెబ్యూ మూవీ కార్తికేయ చాలా మంది క్రిటిక్స్‌కి కూడా నచ్చింది. కానీ.. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ విమర్శకులను ఆకట్టుకోలేపోయింది. ఈ సినిమా స్పెషల్ గా ఉత్తరాది ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్టైన, డబ్బులు చేసుకున్న చందూ మొండేటి.. ఐడియాలజీ, మేకింగ్ స్టైల్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి అనడం కంటే తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన ‘తండేల్’ సైతం బ్లాక్ బస్టర్‌గా నిలిచినా మేకింగ్, స్టోరీ, ఎమోషన్స్ చాలా వీక్‌గా, తప్పుగా చూపించాడని అనేక విమర్శలు ఉన్నాయి. ఇలాంటి దర్శకుడితో సూర్య పనిచేయడం మాకు అస్సలు ఇష్టం లేదని అభిమానులంటే, విమర్శకులు.. పెద్ద సాహసం చేస్తున్నాడు అంటున్నారు. ఇక విశ్లేషకులు ఇలాంటి డైరెక్టర్‌కు తమిళ్ మార్కెట్ ఆహ్వానించదు అంటున్నారు. ఆయనకు నార్త్ ఆడియెన్స్‌లో మాత్రమే కాస్త మార్కెట్ పుట్టే అవకాశం ఉంది, తెలుగులో కూడా లాంగ్ లాస్టింగ్ మార్కెట్ కష్టమే అంటున్నారు.
ఇక వెంకీ అట్లూరి ఓల్డ్ లైనప్ చూస్తే.. టాలీవుడ్ హీరో కాదు ఎవరైనా నో నే చెబుతారు కదా అని కొందరు అంటున్నారు. కానీ.. వాతి(సార్), లక్కీ భాస్కర్ సినిమాలు డైరెక్టర్ గా ఆయన స్వరూపాన్నే మార్చేశాయి. దీంతో వెంకీపై కాస్త ఆశలున్న.. అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!