Dharmendra: కుమారుడు సన్నీ డియోల్ ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ శ్మశానవాటికకు చేరుకున్నారు. ధర్మేంద్ర మరణ వార్త తెలిసినప్పటి నుండి, అనేక మంది బాలీవుడ్ తారలు ఆయనకు అంతిమ నివాళులు అర్పించడానికి శ్మశానవాటిక వద్దకు వెళ్తున్నారు. దివంగత నటుడికి తుది వీడ్కోలు పలికేందుకు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చారు.
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. నవంబర్ 10న, ధర్మేంద్ర ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచినట్లు నివేదికలు వెల్లడించాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు ఆసుపత్రికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి కనుక్కొని ఆరా తీశారు.
డిసెంబర్ 8న ధర్మేంద్ర 90 వ పుట్టినరోజు
డిసెంబర్ 8న ధర్మేంద్ర 90వ పుట్టినరోజు. ఆయన ఇంట్లో కోలుకుంటున్న సమయంలో, కుటుంబం ఆయన పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన పుట్టినరోజుకు కేవలం 14 రోజుల ముందు, దిగ్గజ నటుడు మరణించారు. ఆయన మరణం పరిశ్రమను సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త వినగానే ప్రముఖులు షాక్‌లో మునిగిపోయారు. ఫ్యాన్స్ తో సినీ సెలబ్రిటీలు ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజ నటుడికి నివాళులు అర్పిస్తున్నారు.
Also Read: Mandhana Wedding: సంగీత్‌లో రొమాంటిక్ డ్యాన్స్‌తో అదరగొడుతున్న స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్..
ధర్మేంద్ర కెరీర్
గురించి చెప్పాలంటే, ధర్మేంద్ర చివరిసారిగా కృతి సనన్ , షాహిద్ కపూర్ నటించిన “తేరి బాతే మే ఐసా ఉల్జా జియా” చిత్రంలో కనిపించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన “21kkies” ఆయన చివరి చిత్రం. ఈ సినిమాలో ఆయన అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద తండ్రిగా నటించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది.

