Mazaka OTT Update
ఎంటర్‌టైన్మెంట్

Mazaka OTT: ‘మజాకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఈ ఉగాదికి నవ్వులే నవ్వుల్!

Mazaka OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా, నేచురల్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్, ‘మన్మథుడు’ బ్యూటీ అన్షు కీలక పాత్రలలో నటించారు. హాస్య ఎంటర్‌టైన్‌మెంట్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించారు. ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. టీమ్ ఊహించినంతగా అయితే సక్సెస్ అందుకోలేకపోయింది. కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినా, కాన్సెప్ట్ పరంగా మాత్రం ఈ సినిమాపై విమర్శకులు సైతం పెదవి విరిచారు. కానీ కామెడీ పరంగా మాత్రం నవ్వులకు లోటుండదు అనే టాక్‌ని ఈ సినిమా సొంతం చేసుకుంది. మరి థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?

సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘మజాకా’. కానీ ఆయనకు తీవ్రంగా అని చెప్పలేం కానీ, నిరాశనే మిగిల్చిందని మాత్రం చెప్పుకోవాలి. విడుదలకు ముందు ఎంతగానో ప్రమోషన్స్ నిర్వహించారు. ఫస్ట్ టైమ్ మీడియాను లైవ్‌లో పెట్టుకుని ఓ పాట చిత్రీకరణను పూర్తి చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై భారీగానే అంచనాలను పెంచేశాయి. రవితేజకు ‘ధమాకా’ వంటి హిట్ ఇచ్చిన త్రినాధరావు నక్కిన.. ఈసారి సందీప్‌కు కూడా ‘మజాకా’తో అలాంటి హిట్‌ని ఇవ్వబోతున్నాడనేలా విడుదలకు ముందు అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో అయితే మోత మోగించలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుందని యూనిట్ భావిస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో అనుకుంటున్నారా?

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రికార్డులు బద్దలు కొడుతున్న జీ5 ఓటీటీలోకి ఉగాది పండుగ స్పెషల్‌గా ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రాబోతోంది. తాజాగా యూనిట్ ప్రీమియర్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. మార్చి 28 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలతో పాటు ఈ సినిమా కూడా యాడ్ అవడంతో ఈ ఉగాదికి జీ5లో నవ్వులే నవ్వుల్ అంటూ సదరు ఓటీటీ తమ వీక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది.

Also Read- Krishna Vamsi: అల్లూరి సమాధి వద్ద.. ఎన్నో ఏళ్ల కల తీరింది

‘మజాకా’ స్టోరీ విషయానికి వస్తే.. వెంకటరమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ (సందీప్ కిషన్)కు పెళ్లి చేసి.. ఆడ దిక్కులేని తన ఇంటిలో ఓ ఫ్యామిలీ ఫొటో చూసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ ఆడ దిక్కు లేకపోవడమే కారణం చూపిస్తూ.. కొడుకుకు పిల్లని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఈ క్రమంలో తను పెళ్లి చేసుకుంటే, తన కొడుకుకు కూడా పెళ్లి అవుతుందని వచ్చిన ఉచిత సలహాతో.. వెంటనే తను కూడా ప్రేమించడం మొదలెడతాడు. అలా అనుకుంటాడో లేదో తన కళ్లముందుకు యశోద (అన్షు) వచ్చేస్తుంది. వయసు గురించి కూడా ఆలోచించకుండా ఆమె ప్రేమలో పడతాడు. కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ)ని ప్రేమిస్తుంటాడు. వీళ్ల ప్రేమకథలు ఎటువంటి మలుపులు తిరిగాయి? ఈ తండ్రీ కొడుకులకు, భార్గవ్ వర్మ (మురళీ శర్మ)కు మధ్య విరోధం ఏమిటి? అది ఆ ఇద్దరి ఆడవాళ్ల ప్రేమతో ఎలా ముడిపడి ఉంటుంది? అనేది తెలియాలంటే ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?