Sundeep Kishan (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Sundeep Kishan: రెజీనాతో మాట్లాడుతూ.. పెళ్లి గురించి ఓపెన్ అయిన సందీప్ కిషన్..

Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హిట్స్ అందుకున్న హీరో ఇటీవలే కాలంలో ఒక్క హిట్ కూడా అందుకోలేక సతమవుతున్నాడు. ఈ యంగ్ హీరో కెరియర్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ యే ఎక్కువ. అయినా కూడా ఫ్యాన్స్ కోసం సినిమాలను చేస్తున్నాడు. సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు సినిమాలు వచ్చాయి. రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, నగరం, నక్షత్రం.. ఇలా నాలుగు చిత్రాల్లో నటించారు. అయితే, వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడించిందని చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. తాజాగా సందీప్ రెజీనా పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read: Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

రెజీనా ‘ఢీ’ షోలో సందీప్‌తో వీడియో కాల్

రెజీనా పాపులర్ డాన్స్ షో ఢీలో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ షోలో ‘ఫ్రెండ్‌షిప్’ థీమ్‌తో ఒక ఎపిసోడ్ జరుగుతుండగా, రెజీనాకు తన బెస్ట్ ఫ్రెండ్‌కు కాల్ చేయమని సవాల్ వచ్చింది. ఆమె ఎవరికి కాల్ చేసిందంటే? మన సందీప్ కిషన్‌ కు కాల్ చేసింది. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Kantara – Chandramukhi: నిద్రలేచిన చంద్రముఖి.. కాంతార టీమ్‌ను వెంటాడుతున్న మృత్యువు.. రెండింటికి లింకేంటి?

సందీప్ సరదా కామెంట్స్

వీడియో కాల్‌లో రెజీనా, “బెస్ట్ ఫ్రెండ్‌కు కాల్ చేయమంటే నీకే కాల్ చేశాను,” అని అంటే, సందీప్ సరదాగా రిప్లై ఇచ్చాడు. “అప్పుడప్పుడు అయినా నీకు ఇలా ఎఫెక్షన్ చూపించే ఛాన్స్‌లు వస్తున్నాయి.” అంతటితో ఆగకుండా, సందీప్ మరో బాంబ్ విసిరాడు. “నా లవ్ స్టోరీలు ఎంత బాధాకరంగా ఉంటాయో ఈ అమ్మాయికి తెలుసు. నీలాంటి ఫ్రెండ్ ఉంటే అసలు పెళ్లే జరగదు” అని అన్నాడు.
ఈ సరదా కామెంట్స్ లైవ్ వీడియో కాల్‌లో జరిగాయి. దీంతో, నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేశారు.

Also Read: Bad Girlz Movie Promotions: ఒక్కసారిగా వేసుకున్న బట్టలు విప్పిన నలుగురు హీరోయిన్లు.. షాకైన జర్నలిస్టులు

సందీప్ బ్రేకప్ స్టోరీస్

సందీప్ తన బ్రేకప్ లవ్ స్టోరీల గురించి రెజీనాకు తెలుసని డైరెక్ట్‌గా చెప్పడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సరదా సంభాషణ వీరి స్నేహ బంధం ఎంత సహజంగా, ఓపెన్‌గా ఉంటుందో చూపిస్తోంది. అయితే, ఈ కామెంట్స్ కామెడిగా చెప్పినప్పటికీ, సందీప్ గత రిలేషన్‌షిప్‌ల గురించి హింట్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!