Dear Uma: ప్రతి వారం ఒకటి కాదు, రెండు కాదు.. ఈ మధ్య మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎగ్జామ్స్, ఐపీఎల్ దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల, భారీ బడ్జెట్ చిత్రాలు వెనక్కి తగ్గడంతో.. ఈ గ్యాప్‌ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే భారీ పోటీ ఉన్నా కూడా, సినిమాలను థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్న రోజునే సుమయా రెడ్డి నటించి, నిర్మించిన ‘డియర్ ఉమ’ కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. తాజాగా ‘డియర్ ఉమ’ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read- Hebah Patel: అప్స్ అండ్ డౌన్స్ చూశా.. తమన్నాలా నేనెప్పుడూ హోం వర్క్ చేయలేదు
వాస్తవానికి ఏప్రిల్ 18న మూడు నుంచి నాలుగు సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి. అందులో నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబోలో రాబోతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కూడా సేమ్ డేట్‌నే రాబోతుంది. అలాగే ప్రియదర్శి ప్రధాన పాత్రలో మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ కూడా సేమ్ డేట్‌నే రాబోతుండగా, ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 17న తమన్నా నటించిన ‘ఓదెల 2’ విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ హెవీ కాంపిటేషన్‌లో కూడా ‘డియర్ ఉమ’ని గ్రాండ్ రిలీజ్‌కు తెస్తున్నారంటే.. కచ్చితంగా వారికి కంటెంట్‌పై ఉన్న నమ్మకమే అని చెప్పుకోవచ్చు. మరి వారి నమ్మకం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 18 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు మేకర్స్ ప్రమోషన్స్‌పై భారీగా దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 18 నాటికి వీటితో పాటు ఇంకా రెండు మూడు సినిమాలు లైన్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

‘డియర్ ఉమ’ విషయానికి వస్తే.. ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుందని మేకర్స్ చెబుతున్నారు. తెలుగమ్మాయి సుమయా రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ఈ సినిమాకు పని చేస్తుంది. తొలి సినిమాతోనే మల్టీ టాలెంటెడ్ తెలుగమ్మాయిగా గుర్తింపును సొంతం చేసుకున్న సుమయ రెడ్డి ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. ఇందులో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read- Arjun Son Of Vyjayanthi: నందమూరి హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు.. ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని రాబోతుందనేలా ప్రేక్షకులకు రీచ్ అయింది. కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమాను హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు