sudheer-babu(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Jatadhara Promotion: సినిమా ప్రమోషన్ ఇలా కూడా చేస్తారా.. సుధీర్ బాబు చేసింది చూస్తే వణకాల్సిందే..

Jatadhara Promotion: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మిస్టరీ త్రిల్లర్ ‘జటాధర’ నవంబర్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సుధీర్ బాబు చేసిన సాహసాలు చూస్తే చమటలు పట్టిస్తుంది. అసలు ఆయన ఏం చేశారు అంటే.. ఈ సినిమా ప్రమోషన్ ఎలా చేద్దాం అని ప్రేక్షకులను అడగ్గా దెయ్యాలు ఉన్న ఇంటిలోకి వెళ్లి అక్కడ పరిస్థితులను వివరించడండి. గోస్ట్ హంటింగ్ లాగా అని కామెంట్ చేశారు. దీనికి ఛాలెంజ్ గా తీసుకున్న సుధీర్ బాబు హైదరాబాదులో ఉన్న ఒక దెయ్యాలు తిరిగే బంగ్లాలో గోస్ట్ హంటింగ్ చేశారు. అది చూసిన ప్రేక్షకులు భంయంతో ఓణికి పోతున్నారు. ఎంత సినిమా ప్రమోషన్ అయితే మాత్రం అలా వెళ్లడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. హీరో మాత్రం ఈ సినిమా ప్రమోషన్ చేయడానికి కష్టపడుతున్న తీరు చూసి ఈ సినిమా చేయడానికి సుధీర్ బాబు ఎంత కష్టపడ్డాడో అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ గోస్ట్ హంటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Pithapuramlo: పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘పిఠాపురంలో అలా’

‘జటాధార’ సినిమా ఒక పురాతన రహస్యాన్ని చుట్టుముట్టిన కథను చెబుతుంది. శివుడి జటాధర (మూకుమట్టి జటలతో కూడిన ఆయుధం) స్వరూపాన్ని కేంద్రంగా చేసుకుని, ధనికతకు సంబంధించిన అతిప్రాకృతిక శక్తులు – ముఖ్యంగా ‘ధనపిశాచి’ – ను చిత్రిస్తుంది. కథలో మంత్రాలు, భక్తి మరియు భయం మధ్య సమతుల్యత ఉంటుంది. ట్రైలర్‌లో “పూర్వం ధనాన్ని దాచిపెట్టి… మంత్రాలతో బంధనాలు వేసేవాడు” అనే డైలాగ్‌తో ప్రేక్షకుల్లో చిల్‌లు పుట్టించింది. ఈ చిత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి పురాతన రహస్యాలను, దాని అతిప్రాకృతిక శక్తుల గురించిన మిథ్స్ మరియు సిద్ధాంతాలను కూడా తనలో ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, భావోద్వేగాలను కదిలించే ఒక డివోషనల్ థ్రిల్లర్. దర్శకులు వెంకటేశ్ కల్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్, మైథాలజికల్ ఎలిమెంట్స్‌ను అద్భుతమైన VFXతో మెరుగుపరచారు.

Read also-Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్న ‘జటాధర’ సినిమా, శివుడి జటాధర స్వరూపాన్ని ప్రేరణగా తీసుకుని, ధనపిశాచి వంటి అతిప్రాకృతిక శక్తులతో ముందుకు సాగుతోంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలయ్యే ఈ చిత్రం, తెలుగు మరియు హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తన తెలుగు మొదటి సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంతో, ఈ చిత్రానికి మరింత ఆకర్షణ పెరిగింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ట్రైలర్ రిలీజ్ తర్వాత, ప్రేక్షకుల్లో భక్తి భావాలు థ్రిల్ అంశాలతో కూడిన ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అక్టోబర్ 17న విడుదలైన ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Chinmayi Sripaada: అలాంటి ట్రోల్స్ చేసేవారికి వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి..

Forest Department: పులుల లెక్కింపుకు వలంటీర్లకు ఆహ్వానం.. ఏఐటీఈ 2026 టైగర్ లెక్కింపులో తెలంగాణ కీలక పాత్ర!

Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం

Rail Accident: మరో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పలువురు మృతి

Baahubali Eternal War teaser: ‘బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1’ యానిమేషన్ టీజర్ వచ్చేసింది చూశారా..