Jatadhara
ఎంటర్‌టైన్మెంట్

Jatadhara: సుధీర్ బాబు ‘సోల్ ఆఫ్ జటాధర’.. ఎలా ఉందంటే?

Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి రెడీ అవుతోన్న ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్ ఫుల్ అప్డేట్‌ని వదిలారు. అదేందంటే..

Also Read- Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

జటాధర ప్రపంచం ఇదే..

రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయిన విషయం తెలియంది కాదు. ఈ విజువల్ స్పెక్టకిల్ చిత్రాన్ని 7 నవంబర్, 2025న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ను విడుదల చేసి, సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశారు. ఈ ‘సోల్ ఆఫ్ జటాధర’ (Soul Of Jatadhara) సినిమా ప్రిమైజ్‌ని అద్భుతంగా సెట్ చేసిందని చెప్పుకోవాలి. సాంప్రదాయ సంగీతంతో.. డివైన్ టచ్ ఇస్తూ వచ్చిన ఈ ‘సోల్ ఆఫ్ జటాధర’ జటాధర ప్రపంచం ఇదని తెలియజేస్తుంది. బీట్‌లు చాలా ఇంటెన్స్‌గా ఉండి, సినిమా టోన్‌తో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక ‘ఓం నమఃశివాయ’ జపం అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మొత్తంగా అయితే ‘సోల్ ఆఫ్ జటాధర’.. ప్రమోషన్స్‌కి కంప్లీట్ జోష్ ఇచ్చింది.

Also Read- FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

అభిమానులకు ఫీస్ట్‌

రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా ఆలపించిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటూ, టాప్‌లో ట్రెండ్ అవుతోంది. డివోషనల్ డెప్త్, రా ఎనర్జీతో కూడిన ఈ పాట థియేటర్లలో అభిమానులకు ఫీస్ట్‌లా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని వంటి వారంతా నటిస్తున్న ఈ సినిమా మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని చూపించబోతుందనే విషయం ఇప్పటికే వచ్చిన టీజర్ తెలియజేసింది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hydraa: మాధాపూర్‌లో అపురూపమైన ప్రాంతం అందుబాటులోకి రానుంది: కమీషనర్ రంగనాథ్

Telangana Education: ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం.. కేజీబీవీల ఆధునీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి

Neutral Voters: తటస్థ ఓటర్లపై అన్ని పార్టీల దృష్టి.. అందరి చూపు అటువైపే..!

Delhi Red Fort Blast: ఢిల్లీ బాంబు పేలుళ్లపై సినీ తారల సంతాపం