Star Heroines: టాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ల పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఒకరు ‘బుట్టబొమ్మ’గా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంటే.. మరొకరు తన డ్యాన్స్‌లు, ఎనర్జీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. వారే పూజా హెగ్డే, శ్రీలీల. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ప్రస్తుతం వీరిద్దరూ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే తమ కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి ఎక్కించుకోవడానికి ఈ ఇద్దరు భామలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
పూజా హెగ్డే ‘జననాయగన్’
పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పెద్ద హీరోలందరి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. కానీ, ఈ మధ్యకాలంలో ఆమె చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఇప్పుడు పూజా తన అదృష్టాన్ని తమిళంలో పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ‘జననాయగన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ కావడం పూజా కెరీర్‌కు అత్యంత కీలకం. ఇది గనుక హిట్ అయితే, కోలీవుడ్‌లో ఆమెకు మళ్ళీ పూర్వ వైభవం రావడమే కాకుండా, టాలీవుడ్లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఆమె ఓ సినిమా చేస్తుంది.
Also Read- The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు
శ్రీలీల ‘పరాశక్తి’
ఇక శ్రీలీల విషయానికొస్తే, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అర డజనుకు పైగా సినిమాలను చేతిలో ఉంచుకుని బిజీగా గడిపింది. కానీ దురదృష్టవశాత్తూ, ఆమె ఇటీవల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ వరుస ఫ్లాపులు శ్రీలీల క్రేజ్‌ను కాస్త తగ్గించాయి. ఇప్పుడు ఆమె తన ఆశలన్నీ కోలీవుడ్ డెబ్యూ మూవీ ‘పరాశక్తి’ పైనే పెట్టుకుంది. ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను మెప్పించి, అక్కడ తన మార్కెట్‌ను సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.
Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్మెంట్ టీజర్ అదిరింది
కెరీర్‌కు ‘బూస్ట్’ ఇచ్చే పరీక్ష!
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లకు ఇప్పుడు ఒకే రకమైన సవాల్ ఎదురవుతోంది. వారు నటిస్తున్న ఈ రెండు తమిళ చిత్రాలు సక్సెస్ అయితేనే వారి కెరీర్‌కు అవసరమైన బూస్ట్ లభిస్తుంది. ఒకవేళ ఈ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోతే మాత్రం, భవిష్యత్తులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగడం వారికి చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఇద్దరు భామలు, కోలీవుడ్ ఎంట్రీతో మళ్ళీ ఫామ్‌లోకి వస్తారో లేదో వేచి చూడాలి. ఏదేమైనా ‘జననాయగన్’, ‘పరాశక్తి’ చిత్రాలు వీరిద్దరికీ ‘మేక్ ఆర్ బ్రేక్’ వంటివని చెప్పక తప్పదు. మరో విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలు పొంగల్ బరిలో ఉండటమే..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

